Saturday, October 1, 2016

చినుకు ధార చిత్రాల హోర

చిక్కు చిక్కుల చిత్రం - చిత్రాంగి చిత్రం   ; 
నీలాల నింగి ఇటు లాల పోస్తూన్నది ; 
తన ముద్దుబిడ్డ ఈ పుడమితల్లికి ; ||
;
చినుకు చినుకు ధార ; 
చిత్రాల హోర ; 
మెరుపుల ఊలుతో ఎన్నెన్ని అల్లికలో! 
మబ్బుల అత్తలు అల్లుతున్నారు   ||
;
చినుకు చినుకు ధార ; 
చిత్రాల హోర ; 
పాలధారల కన్న - ఇవియె మిన్న! - 
అంటాడు కన్నయ్య ; 
అంటూనె ఉరకలిడు వానజల్లులలోకి!  ; ||
;
చినుకు చినుకు ధార 'క్షీరాభిషేకములు ';  
శ్రీరంగధామునికి పాలాభిషేకం ; 
నీ మాట నెపుడైన ; 
మేము కాదందుమా!? చిన్నారి కన్నా! ;

==================================;
;
chikku chikkula chitram - 
chitraamgi chitra ;
neelaala nimgi iTu laala pOstuunnadi ; 
tana muddubiDDa ii puDamitalliki ; ||
;
chinuku chinuku dhaara ; 
chitraala hOra ; 
merupula uulutO ennenni allikalO! 
mabbula attalu allutunnaaru ||
;
chinuku chinuku dhaara ; 
chitraala hOra ; 
paaladhaarala kanna - iwiye minna! - 
amTADu kannayya ; 
amTUne urakaliDu waanajallulalOki!  ; ||
;
chinuku chinuku dhaara 'kshiiraabhishEkamulu ';  
Sreeramgadhaamuniki paalaabhishEkam ; 
nee mATa nepuDaina ; 
mEmu kaadamdumA!? chinnaari kannA! ;
;

No comments:

Post a Comment