బాలుడేమొ చెప్పొద్దూ!
"మురిపాలకు పుట్టినిల్లు" :
తరియించే -
తరుణము వచ్చేసింది! ||
;
యమునమ్మా!
జోరు జోరు! తగ్గు! తగ్గు! :
అలల జోరు తగ్గించుము!
వసుదేవుడు గంపలోన ;
చిన్నారి కృష్ణమ్మను
మోసుకునీ వచ్చు వేళ ;
కించిత్తు ఇంగితముతొ
మెలగుమమ్మ! యమునమ్మా! ||
;
అలలెగసిన మేను తడిసి,
మా కన్నకు జలుబు చేయు;
వంశీకృష్ణుని ఒడలు
చలితో జివజివ వణుకును ;
;
యమునమ్మా! జాగ్రత్త!
నీ తరగ చీర కుచ్చిళ్ళను;
గుత్తంగా పట్టుకుని,
లీలామానసచోరునికి ;
పదిలంగా దారినివ్వు!
అతదే - గీతావాక్ నిర్మాత!
"పదిలపరచు చరితను!" ;
;
కంసాది రక్కసులను
ఉక్కడిచే ధీరుడు! ;
నీ నుండి
పయనించుచున్నాడని ;
గొప్పగాను నీల్గేవు!
బహు గొప్పగాను నీల్గేవు!
;
సరి!సరి! అది సహజమే!
అలా విర్రవీగడము!
అదిగో! ఆ గాలి తరగ లిలా
మోసుకొనీ తెస్తున్నవి
వేణురవము! :
భద్రం! ఓ యమునమ్మా!
జాగ్రత్! జాగ్రత్!జాగ్రత్!
;=========================
charitra ;-
bAluDEmo cheppoddU!
"muripAlaku puTTinilli" :
tariyimchE taruNamu
wachchEsimdi! ||
;
yamunammA!
jOru jOru! taggu! taggu! :
alala jOru taggimchumu!
wasudEwuDu gampalOna ;
chinnaari kRshNammanu
mOsukunii wachchu wELa
kimchittu imgitamuto
melagumamma! yamunammA! ||
;
alalegasina mEnu taDisi,
maa kannaku jalubu chEyu;
waSIkRshNuni oDalu chalitO
jiwajiwa waNukunu ;
yamunammA! jAgratta!
nI taraga chIra kuchchiLLanu;
guttamgaa paTTukuni,
liilaamaanasachOruniki ;
padilamgaa daariniwwu!
atadE geetaawaak nirmaata!
"padilaparachu charitanu!" ;
;
kamsaadi rakkasulanu
ukkaDichE dhiiruDu! ;
nii numDi payanimchuchunnADani ;
goppagaanu neelgEwu! ; sari!sari!
adi sahajamE! alaa wirrawIgaDamu! ||
;
adigO! A gAli taraga lilA
mOsukonii testunnawi
wENurawamunu! :
bhadram! O yamunammA!
jaagrat! jaagrat! jaagrat!
;
***************************************,
;
[ శ్రీ కృష్ణ గీతాలు ] [ పేజీ 50 ; పాట 44 ]
No comments:
Post a Comment