జల బాష్పముల మూట మూపున ఉంచుకుని
తన ప్రయాణములు ముందుకు సాగాలి
అలుపుసొలుపెరుగని పాంధుడు ఈ గాలి ||
;
కొండల కోనల తిరుగాడెను గాలి
తోటల తోపుల నడయాడె గాలి
ఈ చిరు గాలి ||
;
ఆరు ఋతువులను బాగ
పరిశీలనలు చేసె!
రాళ్ళు రప్పలలోన
సురుచిర పయనాలు ||
;
ఎన్నెన్నొ పయనాలు చేసింది గాలి
రాధికా కృష్ణుల వేణువున జారింది
మృదు రాగ సంగీత గానమై తనరింది
"ధన్య ఐనాను!" - అని ఎలుగెత్తి చాటింది గాలి
ఈ చిరు చిలిపి గాలి ||
===================================;
jalabaashpamula muuta
muupuna unchukuni
tana prayaanamulu
mumduku saagaali
gaali tiirdha yaatrikuDu
alupu soluperugani
paamdhuDu I gaali ||
;
komDala kOnala tirugaaDenu gaali
tOTala tOpula naDayaaDe gaali
ii chirugaali ||
;
Aru Rtuwulanu baaga
pariSeelanalu chEse!
[raaLLu rappalalOna
suruchira chiru
chiru payanaalu ||
;
ennenno prayANammulu
chEsimdi gaali
raadhikaa kRshNula
wENuwuna jaarimdi
mRdu raaga samgeeta
gaanamai tanarimdi
"dhanya ainaanu!" - ani
elugetti chATimdi gaali
ii chiru chilipi gaali ||
;
No comments:
Post a Comment