Thursday, October 6, 2016

వేణు వినోది

వేణు వినోదీ! నీదు ; 
లీలా హేలలు ఎన్నెన్నో :  || 
;
నీ మురళీ రవళీ మాలలలోన ; 
నీలోత్పల కుసుమమాయెను ; 
లలన రాధిక ; 
నవమల్లికా సుమములాయిరి, గోపికలు ;  ||
అచ్చోటను ఇచ్చోటను ; 
ఎచ్చోటను నీవైతివి ; 
చూడ సహస్రాక్షుడైనా 
చాలడు - నిజమిది ముమ్మాటికీ :  || 
;
నవ్వుల వెన్నెల నాజూకు ; 
మలయ సమీరము, 
త్రెళ్ళు మెరుపుల ; 
తళుకులు ఎన్నో చిలికినవి :  || 
;
ప్రమదల హృదయ భాండముల ; 
సుధా ధారలు శత కోటి ; 
ఉప్పొంగెను, గనరే ఈ వింత!:  ||  
;
=======================,  
;
                   wENu winOdi ;- 
wENu winOdI! nIdu ; 
leelaa hElalu ennennO :  || 
nee muraLI rawaLI maalalalOna ; 
lalana raadhika ; 
neelOtpala kusumamaayenu ; 
nawamallikaa sumamulaayiri, gOpikalu ;  ||
achchOTanu ichchOTanu ; 
echchOTanu neewaitiwi ; 
chUDa sahasraakshuDainaa 
chaalaDu ; nijamidi mummATikI :  || 
;
nawwula wennela naajuuku ; 
malaya sameeramu, 
treLLu merupula ; 
taLukulu ennO chilikinawi :  || 
;
pramadala hRdaya BAmDamula ; 
sudhA dhAralu Sata kOTi ; 
uppomgenu, ganarE I wimta!:  || 
[ శ్రీ కృష్ణ గీతాలు ] [ పేజీ 81 ; పాట 76 ]  

No comments:

Post a Comment