Friday, September 14, 2018

పల్లెపట్టు గుబాళింపు

ప్రకృతికి పులకింత,
బ్రహ్మ తూలికకు ;
పన్నీటి చిలకరింత,
పల్లెపట్టు గుబాళింపు ;  ||
;
వెన్నెల, వెన్నెల, వెన్నెల ;
వెన్నెల కొలతలు ఎంత?
వెన్నెల తూకం ఎంత?
దుత్తలోని వెన్నలతొ సరి సమం ;  ||
;
వెన్నెల, వెన్నెల, వెన్నెల ;
వెన్నెల తూకం ఎంత?
వీశ, మానిక, కుంచం ;
ఆ గగన పర్యంతం ;   ||
;
వెన్నెల బరువు ఎంత? 
మన కృష్ణుని నవ్వు అంత ;
కాదు, క్రిష్ణ హాసములకు ;
ఎంత మాత్రమూ సరితూగవులే!
అవి సరితూగవులే!  ;   ||

No comments:

Post a Comment