Sunday, September 16, 2018

ఉళ్ళుళ్ళళ్ళాలు - సాదు బొట్టు

ఉంగరమ్ము వేలు తోటి పెట్టమని అంటాడు ; 
నెన్నుదుట బొట్టును పెట్టమనంటాడు ; 
బుంగమూతి పెట్టి క్రిష్ణుడు ;
బుగ్గలు పూరించి, దిబ్బున గాలిని కొట్టి ;
"నీతో పచ్చి, అంతే." అంటాడు బులిపిస్తూ క్రిష్ణుడు ;  || 
;
"సున్నా చుట్టావు కదా - నీ లేత పెదవులు ;
ఈ బుంగమూతికి మల్లే, పెడుదును గుండ్రని బొట్టును - 
చాదు బొట్టును బుగ్గను పెడుదును."

తల్లి పలుకులకు ; 
ఉలుకు, ఉక్రోషం - గోవర్ధన కొండంతగ - 
మా క్రిష్ణునికి, చిన్నారికి, ఇంత బుల్లి మా బుజ్జాయికి ; 
బుడి బుడి ఏడ్పులు, మము బెల్లిస్తూను ; 
;
అంటూ నవ్వులు వెదజల్లులు - 
అన్ని దిక్కులకు పరువంగా ; 
పరుగులు పెట్టే నల్లనయ్యను పట్టి -  
తిలకమును తీర్చిరి భామలు ;
;
ఌఌౡ ఌఌౡ ఌౡ ఌౡ ళుళ్ళుళ్ళా .....  
అంటూ ఉళ్ళుళ్ళలు కొట్టుతూ ..... 
సాదు బొట్టుతో ఈ తూరి -
కస్తూరి  తిలకము కూడా ;
తీర్చి దిద్దిరి భామలందరు ;    
;
===================; ;
;
umgarammu wElu tOTi peTTamani amTADu ; 
nennuduTa boTTunu peTTamanamTADu ; 
bumgamuuti peTTi krishNuDu ;
buggalu puurimci, dibbuna gaalini koTTi ;
"neetO pacci, antE." amTADu bulipistuu krishNuDu ;  || 
;
sunnaa cuTTaawu kadaa - 
nee lEta pedawulu ;
ee bumgamuutiki mallE ; 
peDudunu gumDrani boTTunu - 
caadu  boTTunu bugganu peDudunu."

talli palukulaku ; 
uluku, ukrOsham - gOwardhana komDamtaga - 
maa krishNuniki, cinnaariki ; 
imta bulli maa bujjaayiki ; 
buDi buDi EDpulu ; 
mamu bellistuunu ; 
;
amTU nawwulu wedajallulu - 
anni dikkulaku paruwamgaa ; 
parugulu peTTE nallanayyanu paTTi -  
tilakamunu teerciri bhaamalu ;
;
ఌఌౡ ఌఌౡ ఌౡ ఌౡ LuLLuLLA .....  
amTU uLLuLLalu koTTutuu ..... 
saadu boTTutO ee tuuri -
kastuuri  tilakamu kUDA ;
teerci diddiri bhaamalamdaru ;

No comments:

Post a Comment