Friday, September 14, 2018

శిఖి పింఛధారి ఐనాడు కృష్ణయ్య

క్రిష్ణుడు అడిగిందే తడవుగా 
ఇవ్వలేదు నెమలికన్ను అమ్మకచెల్లా! 
నెమలి ఎంత గడసరి, అమ్మకచెల్లా! ||
;
నాట్య సోయగాను తిలకించెను క్రిష్ణయ్య ; 
వయ్యారి మయూరి - 
నాట్య సోయగాను తిలకించెను క్రిష్ణయ్య ; 
'నెమలీ! ఇటు రమ్మనెను ;
రా! రా! రా రమ్మనెను ;
ముద్దుగాను పిలిచెను చిన్ని క్రిష్ణుడు : || 
;
'వస్తే నాకేమిటి!? ఏమిస్తావు!?'
రొక్కించెను గడుసు నెమలి ; 
కొక్కిరించు టెక్కెముతో ఆ కేకి ;
ఎగర లేని పక్షికి ఎంతటి టెక్కు ;
అవకాశం తనది కదా - అందుకే ఆ నిక్కు ;
అది చూసే యమునమ్మకు నిత్య వినోదం : ||  
;
చిన్ని వేణు గానం  కొసరు కొంచెమివ్వు, చాలు!'
అని చెవిలోన ఊదింది చిరుగాలి ;
పిల్ల గాలి సలహాను పాటించెను నల్లనయ్య ; 
పిల్లనగ్రోవి రాగం ; విన్నదే తడవుగా ; 

మైమరచెను వన మయూరి, పురి విప్పి ఆడినది  ; 
తన పురిలో నుండి ఈకలు - దోసిళ్ళు ఇచ్చింది :
;
తళ తళల ఈకలు, మిలమిలల ఈకలు ; 
మెరుపు మెరుపు  ఈకలు, మెరిసేటి ఈకలు ;
కన్ను కాని కన్ను, ఇది నెమలి కన్ను ;
క్రిష్ణమ్మ  సిగలోన తురిమింది ; సిరి సిరి ; 
;
నాటి నుండి శ్రీక్రిష్ణుడు, అయ్యెను శిఖి పింఛధారి , 
అయ్యారే, అదే కదా ఈ ముచ్చట ;
గొప్ప అచ్చట్లు, ముచ్చట్ల కావ్య గాన లహరిక : ||
;
=================; ,
;
SiKi pimCadhAri ainADu kRshNayya ;- 

pallawi ;- 
krishNuDu aDigimdE taDawugA 
iwwalEdu nemali  kannu ammakacellaa! : 
nemali emta gaDasari, 
ammakacellaa! : ||
;
nATya sOyagAnu tilakimcenu krishNayya ; 
wayyaari mayuuri - 
nATya sOyagAnu tilakimcenu krishNayya ; 
'nemalii! iTu rammanenu ;
raa! raa! raa rammanenu ;
muddugaanu pilicenu cinni krishNuDu : ||
;
'wastE naa kEmiTi!? Emistaawu!?'
rokkimcenu gaDusu nemali ; 
kokkirimcu TekkemutO aa kEki ;
egara lEni pakshiki emtaTi Tekku ;
awakaaSam tanadi kadaa, 
amdukE aa nikku ;
adi cuusE yamunammaku nitya winOdam : ||
;
cinni wENu gaanam  kosaru komcemiwwu, caalu!'
ani cewilOna Udimdi cirugaali ;
pilla gaali salahaanu paaTimcenu nallanayya ; 
pillanagrOwi raagam ; winnadE taDawugA ; 

maimaracenu wana mayuuri, 
puri wippi ADinadi  ; 
tana purilO numDi iikalu - dOsiLLu iccimdi ; 
;
taLa taLala eekalu, milamilala eekalu ; 
merupu merupu  iiakalu ; merisETi eekalu ;
kannu kaani kannu, idi nemali kannu ;
krishNamma  sigalOna turimimdi ; siri siri ;
;
naaTi numDi SreekrishNuDu ; 
ayyenu SiKi pimCadhAri , 
ayyArE, adE kadaa ee muccaTa ;
goppa accaTlu, muccaTla -
kaawya gaana laharika : ||

No comments:

Post a Comment