Friday, September 14, 2018

గోరంత వెన్న చాలు

గోరంత దీపమ్ము వీడు, చిన్నమ్మా! ;
మా చిన్నారి కృష్ణుడు ;
ఎల్లరి కంటి దీపం జ్యోతి వెలుగుల తోడు ;  ||

కొన గోరు మీటుల చిన్న వాడు క్రిష్ణమ్మ ;  
గోరంత వెన్న చాలని అంటాడు ; 
గోరంత వెన్న - తనకు చాల ఎక్కువ - అంటాడు ;

చిటికెడంత ఇస్తే చాలమ్మా అంటాడు ; 
చిట్టి గోళీ అంత ఇస్తే చాలు లేమ్మా - అని ;
మరి మరి మరి మరీ వేడుకుంటుంటాడు ;
ఏమరనీయడు ఒక క్షణము ఐనా ; || 
;
మాత యశోదమ్మ వద్దకు చేరి, 
గారాల రాగాలు, ముద్దు గారాబాలు, 
మురిపాలు, గుణుపులు, గొణుగుళ్ళు ; 
అబ్బబ్బ, వీనితో ఎట్లాగ వేగగలం ;
ఏమరనీయడు ఒక క్షణము ఐనా ; || 

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ;
;
*****************************************;
గోరంత దీపం ;

No comments:

Post a Comment