Saturday, April 30, 2011

విమల రూపిణి వీణా ధారిణి
























;;;;;;;;;;; 
వాగీశు పత్నీ! వర దాయినీ!
లావణ్య  దరహాసినీ!; స్మిత వీచి సంధాయినీ! ||

తెలి కలువ పుష్పాల; మృదు పరాగములుగా ; 
శాంతి సౌభాగ్యాలతో విరబూయించుచూ ;  
బాగైన విద్యలు ;ముజ్జగములకును  ; 
నీ అనుగ్రహముచే లభియించెనమ్మా! || 

చేత పుస్తకము, మాల, వర వీణతో;
విమల రూపిణిగా;వెలసి ఈ వసుధపైన ;
బుద్ధి సామ్రాజ్యాల నిచ్చు చున్నావమ్మ!;  
లావణ్య  దరహాసినీ!; స్మిత వీచి సంధాయినీ! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&


Wednesday, April 27, 2011

ఉగాది విశేషాలు



"చైత్రే మాసి జగద్ బ్రహ్మా - ససర్గ పథమే అహని;
వత్సరాదౌ వసంతాదౌ  రవిరాద్యే తథైవ చ"

బ్రహ్మ కల్పములో, బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. మొదటి ఉగాదిగా ఆ సుముహూర్తము పరిగణనలోనికి వచ్చినది.

"ప్రభవ" మొదటి సంవత్సరము, మొదటి చిత్ర మాసములో, మొదటిది వసంత ఋతువు ; మొదటి రోజు ఆదివారము, మొదటి తిథి పాడ్యమి నాడు, ప్రప్రథమ నక్షత్రమైన "అశ్వినీ నక్షత్రము నందు " త్రిమూర్తులలో ఆద్యుడు, చతుర్ముఖుడు ఐన విధాత ఈ సకల సృష్టి నిర్మించ సమకట్టాడు.

1870 సంవత్సరము నుండి తెలుగు పంచాంగము, ప్రామాణికమైన కేలండరు వెలువడ సాగినది.

భారతీయులందరూ ఆప్యాయతతో చేసుకునే పండుగ "ఉగాది". కొత్త సంవత్సరమును ఉగాది పండుగగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ ఉగాదినీ ఏ సమయములో నిర్ధారణ చేయాలి?

"బ్రహ్మాది యుగాది కృత్", "బ్రహ్మ యుగావర్తః " అనగా అది "వసంత విషువత్ కాలము" ఈ నిర్ణయములో ఎంతో అనుకూలత, భౌగోళిక పరిశీలనచే నెలకొల్పినదగుటచే, ఎంతో సామంజస్యము కలిగి ఉన్నది. ఈ రీతిగా వసంత కాలమును, ఉగాది అని వరాహ మిహిరుడు నిర్దేశించిన స్వచ్ఛమైన నిశ్చయమై
,ప్రజలచే ఆమోదించబడి,ఆచరించ బడుచున్నది కదా!

"ధర్మ సింధువు" – “ఉగాది నాడు సంకల్పమును మార్పు చేస్తూ,  చెప్పుకుని
పూజలు చేసి, ఉగాది పచ్చడిని ప్రసాదముగా తీసుకోవాలి. ప్రసాదమును “ఉగాది పచ్చడి”అంటూ పేర్కొనుట తమాషా ఐన వాడుక.

అశోక వృక్షము లేత చిగుళ్ళను, వేప పూతను, లేత మామిడికాయ ముక్కలు, కొత్త చింత పండు, కొత్త బెల్లము ముఖ్యమైన దినుసులు. ఇంకా చెరకు ముక్కలు, జీల కర్ర లతో ప్రసాదమును తయారు చేస్తారు.

యుగాది పర్వ దినమునాడు పంచాంగ శ్రవణము ద్వారా సంవత్సర ఫలాలను, కాల మాన పరిస్థితులనూ, రాజకీయ రంగములోనూ, సంఘములోని తతిమ్మా రంగాలలలోనూ  సంభవించే పరిణామాలను తెలుసుకొనుట ప్రజలలో ఆచారముగా పాటించబడుతూన్న ఔత్సాహిక విధి.

ఉగాది పర్వ దినాన నూత్న సంవత్సరనామమునకు శ్రీకారం చుడతాము.
ఈ రోజే కొత్త సంవత్సరము పేరును చెప్పడానికి నాంది పలుకుతాము.
అనగా నిన్నటి దాకా చెప్పిన
శ్రీ వికృతి నామమునకు మారుగా - శ్రీ ఖర నామమును పలుకుతూ, అర్చనా సాంప్రదాయాలను కొనసాగించవలెనన్న మాట!

“తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ|
పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్||”

లోకాస్సమస్తా స్సుఖినో భవంతు.
ఓమ్! శాంతిః! శాంతిః!శాంతిః!

               తెలుగు సంవత్సరములు

మన చాంద్రమానమును అనుసరించి నిర్మించిన పంచాంగము ప్రకారము
60 సంవత్సరములు కాల చక్రము.
గత శతాబ్దిలో, 1987 లో
మొదటిదైన " ప్రభవ " నామ సంవత్సరము మొదలైనది.
ప్రస్తుతము ఖర=2011-12 నామ వత్సరము లోనికి అడుగిడినాము.
వరుసగా 60 సంవత్సరముల పేర్లను విహంగావలోకనము చేద్దాము.
క్రమ సంఖ్య తెలుగు సంవత్సరము - ఆంగ్ల సంవత్సరము
1 ప్రభవ         1987-88
2 విభవ         1988-89
3 శుక్ల         1989-90
4 ప్రమోదూత 1990-91
5 ప్రజోత్పత్తి 1991-92
6 అంగీరస 1992-93
7 శ్రీముఖ 1993-94
8 భావ         1994-95
9 యువ 1995-96
0 ధాత         1996-97
11 ఈశ్వర 1997-98
12 బహుధాన్య 1998-99
13 ప్రమాది 1999-2000
14 విక్రమ 2000-01
15 వృష         2001-02
16 చిత్రభాను 2002-03
17 స్వభాను 2003-04
18 తారణ 2004-05
19 పార్ధివ 2005-06
20 వ్యయ 2006-07
21 సర్వజిత్ 2007-08
22 సర్వధారి 2008-09
23 విరోధి         2009-10
24 వికృతి 2010-11
25 ఖర         2011-12
26 నందన 2012-13
27 విజయ 2013-14
28 జయ         2014-15
29 మన్మధ 2015-16
30 దుర్ముఖి 2016-17
31 హే విళంబి 2017-18
32 విళంబి 2018-19
33 వికారి         2019-20
34 శార్వరి 2020-21
35 ప్రవ 2021-22
36 శుభకృత్ 2022-23
37 శోభకృత్ 2023-24
38 క్రోధి         2024-25
39 విశ్వావసు 2025-26
40 పరాభవ 2026-27
41 ప్లవంగ 2027-28
42 కీలక         2028-29
43 సౌమ్య 2029-30
44 సాధారణ 2030-31
45 విరోధికృతు 2031-32
46 పరీధావి 2032-33
47 ప్రమాదీచ 2033-34
48 ఆనంద 2034-35
49 రాక్షస 2035-36
50 నల         2036-37
51 పింగళ 2037-38
52 కాలయుక్తి 2038-39
53 సిధార్థ 2039-40
54 రౌద్రి         2040-41
55 దుర్మతి 2041-42
56 దుందుభి 2042-43
57 రుధిరోద్గారి 2043-44
58 రక్తాక్షి    2044-45
59 క్రోధన         2045-46
60 అక్షయ 2046-47
 
అందరికీ సకల పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ
ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సర్వే జనాః సుఖినో భవంతు !

               ఉగాది విశేషాలు ( Link )


@@@@@@@@@@@@@@@@@@@@@@@@

Tuesday, April 26, 2011

దివిని మించిన దుర్గమారణ్యాలు


రామ! రామ! అను మంత్రము - కారడవికి దొరికెను
అరణ్యములు దివి సొగసుకు ప్రతిమలుగా తనరెను ||

చిలక పలుకులన్ని కూడ - తీపి తేనెలెటులైనవి?
"రామ! రామ!" అనుచు సదా - ఒకే ధ్యానమయెను కద! ||

ముని జనుల సమ్మోహన కరమైన మంత్రము-
మౌని పెదవులు గాన మందిరములే ఆయెను ||

కాననమున దారులన్ని పద్మమయములాయెను;
బాటలన్ని భక్త గాన తోరణములై నిలిచెను ||

    photo  (Link 1)

@@@@@@@@@@@@@@@@@@@@@@






















kaaraDaviki dorikenu
araNyamulu divi sogasuku
pratimalugaa tanarenu   ||

chilaka palukulanni kUDa -
tIpi tEneleTulainavi?
"raama! raama!"anuchu sadaa -
okE dhyaanamaayenu kada!  ||

muni janula sammOhana karamaina maMtramu-
mauni pedavi gaana maMdiramau viMtaraa!

kaananamuna daarulanni
padmamayamulaayenu;
baaTalanni bhakta gaana
pU tOraNamulai nilichenu  ||

దివిని మించిన దుర్గమారణ్యాలు  

వీణగా మారిన తెడ్డు






















గడ వేస్తూ సాగరా - పదము పాడరా!
పాటతో తెడ్డు కాస్త వీణగా మారినది!
              అద్దిర భన్నా        ||


శబరి అశ్రు బిందువులు
ఆనందపు సెలయేరు ఐనట్టి వింతరా! - అద్దిర భన్నా! ||

శిలకు జీవమిచ్చినవి- పదములు అవి మొక్కరా!
శాంతమునకు నిలువు టద్దమే కద మా రాముడు  ||


@@@@@@@@@@@@@@@@@@@@@

















gaDa vEsTU saagaraa - padamu paaDaraa!
paaTatO teDDu kaasta vINagaa maaruraa    ||


Sabari aSru biMduvulu
aanaMdapu selaEru ainaTTi -addira Bannaa! ||

Silaku jIvamochchinadi- padamulu avi mokkaraa!
SAMtamunaku niluvu Taddamu maa raamuDu  ||

@@@@@@@@@@@@@@@@@@@@@@


చైనా వారి pregnancy calendar



ఆస్ట్రాలజీని అనుసరించి,  ప్రాచీన చైనా జ్యోస్యులు
కొన్ని  పట్టికలను తయారు చేసారు.

పుట్టబోయే బిడ్డ, ఆడ బిడ్డగా, మగ బిడ్డగా - ఆలు మగలు,
తాము- తమకు ఇష్టమైన వారిని పుట్టేటట్లుగా ఎన్నుకొనగలరు.
చీనా పట్టికను మార్గ దర్శకంగా ఉంచుకుని,
నూతన వధూ వరులు, భావి జననీ  జనకులు,
తమకు ప్రియమైన male/ Female Gender ను కనగలరు.
ఈ అంశాలకు శాస్త్రీయ ప్రాతిపదిక -
బహుశా చీనా పంచాంగ కర్తలు - ప్రజా కోటిని నిరంతర పరిశీలనలు పునాదులు.
"అమ్మ" అవబోతూన్న స్త్రీలకు ఇవి కర దీపికలు.

గర్భవతిగా ఉన్న వనిత వివరాలు ఈ చార్టుకు వర ప్రదాతలు.
ప్రెగ్నెంటు ఐన మహిళ, ఆమెకు ఎన్ని నెలలు కడుపుతో ఉన్నదీ
అనే సంగతులని  ఆధారం చేసుకుని,
ఈ చార్టును chaina astrogers చిత్రీకరణ చేసారు.
చైనా వారి జ్యోతిష్య, కేలండరు రూపకల్పనలలో,
అనేక అంశాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూన్నాయి.
వానిలో ఒక చార్టు బహుళ ఉపయోగకారి.
కాబోయే దంపతులకు, నూతనంగా తల్లి దండ్రులు అవబోతూన్న భార్యా భర్తలుకు
ఆహ్లాదాన్ని కలిగించే అంశాలు దీనిలో ఉన్నవి.
గర్భవతులకు మిక్కిలి ఉపయోగకరమైనది చార్టు.
ఔత్సాహిక పరిశోధకులు,
ఈ పట్టికలను జిజ్ఞాసతో చదివి,
ఆమూలాగ్రము పరిశీలనలు చేస్తున్నారు.
నిది, విశేషించి, పరిశీలించ దగినది.
లింగ నిర్ధారణ - కాబోయే "అమ్మ నాన్నల" అభీష్టము ప్రకారము ఉంటుంది - అని ,
ఈ చైనా పట్టికను ఫాలో ఔతూన్న జనుల నమ్మకం

&&&&&&&&&&&&&&&&&&&&&&&&
  matter   ( Link 1)

 matter  (Link 2)


The Chinese birth chart can be used to predict the gender of already conceived baby or if you are planning for a baby, you can choose your baby's gender before conceiving. Given below is the Chinese pregnancy calendar. This chart predicts whether its a boy or girl baby.
The months January to December listed horizontally is the month of conception and the numbers from 18 to 45 listed vertically is the Chinese age of the mother at the time of conception

కట్టుబాట్లు కపికి నేర్పిన నామము


















మదిని వీణగా మలచి, మధు గీతిగ తాను మారు ;
      మంచి నీమములకు* మారు పేరు
        రామ నామము, శ్రీ రామ నామము ||


తొలకరి చిరు జల్లుగా వర్షించే నామము
         రామ నామము, శ్రీ రామ నామము;
విపినములను నవ్య నందనములొనర్చె -
       రామ నామము, శ్రీ రామ నామము       ||

కపివరులకు కట్టుబాట్లు నేర్పినదీ -
       రామ నామము, శ్రీ రామ నామము;
కానలందు శబరి భక్తి(ని) – ఏరువాక చేసినదీ -
          రామ నామము, శ్రీ రామ నామ ము     ||

మదిని వీణగా మలచి, మధు గీతిగ మారునది -
      రామ నామము, శ్రీ రామ నామము  ||

&&&&&&&&&&&&&&&&&&&&&




















       kaTTubaaTlu kapiki nErpina naamamu 


madini vINagaa malachi,
 madhu giitiga taanu maaru;
      maMchi nImamulaku* maaru pEru
        raama naamamu, SrI raama naamamu   |||

maMchi nImamulaku* maaru pEru
        raama naamamu, SrI raama naamamu ||

tolakari chiru jallugaa varshiMchE naamamu,
       raama naamamu, SrI raama naamamu ;
vipinamulanu navya naMdanamulonarche -
       raama naamamu, SrI raama naamamu;            ||  

kapivarulaku kaTTubaaTlu nErpinadii -
        raama naamamu, SrI raama naamamu;
kaanalaMdu Sabari Bakti – Eruvaaka chEsinadii -                                
                      raama naamamu, SrI raama naama mu;; ||

madini vINagaa malachi, madhu giitiga maarunadi -      
                       raama naamamu SrI raama naamamu  ||



వర్ధమాన కవులకై The Picador poetry prize




డాన్ పీటర్ సన్ ( Don Paterson) స్థాపించినది
"పికడార్ ప్రైజు"(The Picador poetry prize).
స్నేహితులతో ఈ బహుమతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న,
కొత్త పద్య రచయితలకై నిర్దేశించారు.
వర్ధమాన పోయెట్రీ రైటర్సుకు ఇది కానుక.

Don Paterson, chair of the judging panel
for the Picador ...The Picador poetry prize

*********************************



Don’s career in poetry and music has been meteoric.
Born in 1963 in Dundee, he moved to London in 1984 to work as a jazz musician,
and began writing poetry around the same time.
He has published seven books of his own poetry and edited several anthologies,
and his list of prizes is deeply impressive, starting with the Forward Prize for Best First Collection then moving on to the Whitbread Poetry Prize,
 the Geoffrey Faber Memorial Award, and the T S Eliot Prize (twice).
He won the Forward prize again in 2009 for his collection called Rain.
He is a Fellow of the Royal Society of Literature and
received the OBE in 2008 and the Queen’s Gold Medal for Poetry in 2010

Link 2 


Link for Details 1

Sunday, April 24, 2011

వాన హార తంత్రులు





















మేఘాల తేరులోన;
రారండీ! మెరుపుల్లార! ;
మిరుమిట్ల దామినులు;
అందాలకు కేంద్ర బిందులు; ||

తళ తళల విద్యుల్లతలు;
చీకట్లకు ఉలికిపాట్లు
కారు చీకట్లకు జడిపింపులు;
రా రండి! సౌదామినులూ!

మేఘాలకు గుమ్మాలు;
మీరు- వర్షాలకు దారాలు

వర్స్ఘ ధార పుష్పాలను
కట్టినట్టి దారాలు


వాన పూల తోరణాలను;
ఈ భువికి - ఒసగే ఉపకారులు
మీరే! ఓ తటిల్లతలు!
రారండీ మెరుపులార!;


మీ, సౌహార్ద్రత ఏరువాక;
కర్షక జనామోద వేడుక;
ఈ సంబరాల పుడమికి
స్వాగతమిదె! రండి సుస్వాగతము!


@@@@@@@@@@@@@@@@

mEGAla tErulOna;
raaraMDI! merupullaara! ;
mirumiTla daaminulu;
aMdaalaku kEMdra biMdulu;

taLa taLala vidyullatalu;
chIkaTlaku ;ulikipATulu;
kaaru chIkaTlaku; jaDipiMpulu;

mEGAlaku gummaalu;
mIru- varshaalaku daaraalu;
vaana pUla tOraNAlanu;
I Buviki osagETi;
upakaarulu mIrEnammaa!

O taTillatalaaraa/ra!
raaraMDI merupulaara!;
raa raMDi saudaaminuluu!;
mI, sauhaardrata Eruvaaka;
karshaka janaamOda saMbaraala vEDuka;
mI valanane/nE svaagatamide/mu!ide miiku!


 మేఘాలకు గుమ్మాలు (Link 1)


మబ్బులు,మబ్బులు
దూది మబ్బులు,నీలి మబ్బులు
ఛప్పన్నారు దేశాలన్నీ ;
చుట్టి వచ్చిన చిత్రపు మబ్బులు


Saturday, April 23, 2011

రూఢిగ జగతికీ దీవెనలను ఒసగును




ఒద్దికగా వనితా మణి సీతను కూడి
గద్దె మీద కూర్చున్న;పటాభి రాముడు;
రూఢిగ ముల్లోకములను ఏలువాడు;
మా శ్రీ రామ చంద్ర ప్రభువు   ||

పరమ దయాకరుడు, కరుణామయుడు;;;;
పరంధామ పురుషోత్తమ, వాసు దేవుడు
తరుణి తోటి జగతికీ దీవెనలను ఒసగును  ||

సకల వినుత గుణ శీలుడు, వారిజాక్షుడు;
వికసిత సుమ పరిమళ దరహాస వదనుడు
జానకీ సమేతుడు, జగతికీ దీవెనలను ఒసగును  ||

@@@@@@@@@@@@@@@@@


oddikagaa vanitaa maNi sItanu kUDi 
gadde miida kUrchunna;paTAbhi rAmuDu;
rUDhiga mullOkamulanu 
rakshiMchE prabhuvu, 
purushOttamuDu ||


parama dayaakaruDu, karuNAmayuDu
paraMdhaaaamuDu;daaSarathi;
taruNi tOTi jagatikI dIvenalanu osagunu  ||


sakala vinuta guNa SIluDu, 
vaarijaakshuDu; 
vikasita suma parimaLa darahaasa vadanuDu ||


Wednesday, April 20, 2011

పయనం పుణ్యాల నయనం




పదవే! నా సారంగీ!రంగ నాథునీ కొలువుకు;
భద్రాద్రికి చిల్క పూడి శ్రీ  వైకుంఠం గుడికీ     ||

జుట్టు బాగ దువ్వుకునీ –చీర కట్టు సొగసింపుగ
బయలుదేరుదామే! రంగీ! నా సిరి మల్లీ!భక్తి పూల చిరునవ్వూ! ||

పాపిట బిళ్ళలలో సూర్యుడు –చెంప సరుల చందురుడు
ఇంచక్కా కూర్చుండీ –కదిలారు మనతొటి ఆట్టే శ్రమ లేకుండా
జమ జెట్టీ జిత్తులోళ్ళు –కద వాళ్ళు?, ఆ జంట మన కంటే!
తెలుసుకోవె పిల్లా! – ఈ పయనం , పుణ్య నయనార్ద్రం  ||

అట్టిట్టూ నడయాడక, సూటిగ మన ప్రయాణం
ఆట్టే తడుమాడకుండ మును ముందుకు సాగాలి
గోదారి అవలి గట్టు –చేరుదాము సారంగీ! అటు మట్టి – సాన బంగారం ;

పదవే! నా సారంగీ! రంగ నాథునీ కొలువుకు;
భద్రాద్రికి  చిల్క పూడి శ్రీ వైకుంఠం గుడికీ


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

         payanaM puNyaala nayanaM 

 padavE! naa saaraMgI!raMga naathunii koluvuku;
chilka pUDi SrI kuMThaM guDikii  ||

juTTu baaga duvvukunii –chIra kaTTu sogasiMpuga
bayaludErudaamE!! raaMgI! naa siri mallI  ||

paapiTa biLLalalO sUryuDu –cheMpa sarula chaMduruDu
iMchakkaa kUrchuMDii –kadilaaru manatoTi aaTTE Srama lEkuMDA
 Bakti pUla chirunavvuu! ||
  
jama jeTTI jittulOLLu –kada vaaLLu aa jaMTa mana kaMTE!
telusukOve pillaa! – I payanaM , puNya nayanaardraM  ||
aTTiTTU naDayaaDaka,sUTiga mana prayaaNaM
aaTTE taDumaaDakuMDa munu muMduku saagaali
gOdaari avali gaTTu –chErudaamu ; maTTi – saana baMgaaraM ;  ||

padavE! naa saaraMgI!raMga naathunii koluvuku;
chilka pUDi SrI vaikUMThaM dhaamamuku  ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

కేసెట్సు,casset Tapes ART 2



చేయ చక్కని ;casset Tapes ART
కేసెట్సుటేపు లతో కళాఖండాలు, బొమ్మలు

bommalu (Link )

casset Tapes తో బొమ్మలు


కేసెట్సు నుండి  టేపు వస్తుంది.
ఆ టేపు లతో కళాఖండాలనూ,
చిత్రాలనూ తయారు చేయవచ్చును.
ఇక్కడ చూసి,
వీలైతే ,
వీలు చేసుకుని,
చూసి ఆనందించేందుకు వీలైన బొమ్మలను చేస్తారు కదూ!

*******************

casset images ; (Link 1)

బొమ్మలో బొమ్మలు (Link 2)

 Amazing portraits from C-cassettes by Iri5
at Flickr. Found via Craft blog

Tuesday, April 19, 2011

గుహుని పడవ నమూనా




















;;;;;;;;
అనుపమానము, అద్వితీయము;
ఏడు గిరుల స్వామి నుదుట అలరారే నామము ||

పునుగు జవ్వాజీలను; రంగరించి పన్నీరుల ;
మునుగు దాక కస్తూరీ లేపనముల తయారించి;
మునుముందర తీర్చినారు; సొగసుగాను భక్త కోటి  ||

నదిని రాములోరిని దాటించినాడు ఆ గుహుడు;
ఇది కదా నమూనా ; తన నావ కొరకు గైకొనెను/ నో!?;
అనుచు, మది నెంచిన పద్మావతి పెదవిని చిరునవ్వులు  ||

@@@@@@@@@@@@@@@@@@

anupamaanamu, advitIyamu;
EDu girula swaami nuduTa
alaraarE naamamu ||

punugu javvaajIlanu;
raMgariMchi pannIrula ;
munugu daaka kastUrii-
lEpanamula tayaariMchi;
munumuMdara tIrchinaaru;
sogasugaanu Bakta kOTi ||

nadini raamulOrini
daaTiMchinaaDu aa guhuDu;
idi kadaa namUnaa ;
tana naava koraku gaikonenu/ nO!?;
anuchu - madi neMchina padmaavati;
pedavini chiru navvvulu  ||

@@@@@@@@@@@@@@@@

guhuni paDava namUnaa ;గుహుని పడవ నమూనా


తూరీగ Toy


The Zhuqingting  చైనాలో 400 A.D.లనుండీ ఉన్న ఆట బొమ్మ.
వెదురు/ తాటాకు రేకులతో చేయొచ్చు.
చేతులతో కవ్వంలాగా తిప్పుతూ, గాలిలో విసిరితే,
కొన్ని నిముషాల దాకా ఎగురుతూంటుంది ఈ bambuu తూనీగ.

 ((bamboo dragonfly))

చిలకమ్మ సంఖ్యల జోస్యము















;;;;;;;

ఒక్కొక్క వక్క;
తమల పాకులలోన;
రవ్వంత సున్నం 
నోటి పంటలంట!
'రెండు' బాదం పప్పులు 
అడిగింది ఉడత;
'మూడు' జాం(మ)కాయలు 
కొసరింది చిలక;

“నాలుగు రూకలు రానీ!
మెండుగ పెడతా తిండి”
అన్నాడు యజమాని,
చిలక జోస్యుడు అతడు;

“'ఐదు' దారలు 
  పంచదార, చక్కెరలు
'ఆరు'బయట ఆటలు, 
   'ఏడు' రాత్రుల కథలు;
'ఎనిమిది' అష్టా చమ్మ; 
   'తొమ్మిది' నవ రాత్రులు; 
'దశమీ' నాటికి మనకు 
   దశ తిరుగుతుందిలే! 
మనకు పట్టిందల్లా పసిడి – 
 ఔతుందిలే సామీ!”
- అని శుకము పదముల్లు! 
రా చిలక పలుకుల్లు
  తేనెల ఉరవళ్ళు;

అందరు వచ్చేసారు,
చేతులు చూపించారు;

“జోస్యం మాటేదైనా,
  నీ మధువుల మాటలు
 లక్షల వరహాలు, 
      కోటి దీనారాలు!
అందుకె మేం వచ్చాము;
కీర వాణి, చిలకమ్మా!”
 -  అన్నారు అందరూ,

ముచ్చట్ల చప్పట్లు 
   రా చిలకకు బహుమతులు ; 
కురిపించే మురిపాలు 
  కిళి!కిళి! కిళి! కానుకలు !!!!!!

&&&&&&&&&&&&&&

(In this poem The Noumbers :- 

 One, Two, Three, Four, Five 
   Six, Seven, Eight, Nine, Ten, 
       Lakh, Crore) 

By: jabilli Category: 
పాటలురచన ; కాదంబరీ పిదూరి

{Palm reading,

Sozhi Josiyam,

Naadi Josiyam et al

Kili Josiyam

chilakamma saMKyala jOsyamu

Etcetra are in India, very popular.}

Monday, April 18, 2011

జిగినీల ప్రకృతి




















;;;;; 
ఝుమ్ ఝుమ్ ఝిమ్
మధురాల పాటఅమ్మ! 
నాకు వినిపించు
ఆ కోకిల పాటలు

రిమ్ ఝిమ్ ఝిమ్; పలుకులు
పంచ దార చిలకలు
అమ్మ! నాకు, తెలుపుమా!
రామ చిలుక పిలుపులు

రిమ ఝిమ ఝిమ వన్నెలు
రంగైన వన్నెలు; 
జిగినీల రంగులు
అమ్మ! మనకు కను విందు
మన ఆట పాట సృష్టికి పసందు



&&&&&&&&&&&&&&&&&&


By: jabilli Category: పాటలు

రచన ; Kadambari Piduri

ముత్యాల పల్లకీ ,అమ్మ వారి స్పర్శ


సౌభాగ్యవతి పద్మ అరుదెంచెనమ్మా!సౌందర్య రాశి స్పర్శ ఘనతలు మనము ; ఎన్ననీ వర్ణించగలము, అమ్మాలారా! || 

1)కర్పూర పాత్ర గా మారెనమ్మా! ముత్యాల పల్లకీ;కర్పూర పాత్ర ఆయెనమ్మా! ముత్యాల పల్లకీ;అతివ పద్మావతి ఆసీనురాలవగ || సౌందర్య రాశి||

2)పల్లకీ – కొమ్ములకు కోర మీసాలు వచ్చేనమ్మా;ఔరౌర! పల్లకీ – కొమ్ములకు కోర మీసాలు వచ్చేనమ్మా;ఇమ్ముగా ఈ ముద్దరాలిచట కూర్చొనగానె  || 

3)పల్యంకి కవ్వాటము మించినది ; ఆ స్వర్గ ద్వారాల గుమ్మములను, ఆహాహ! చూడరే!ఓ ముద్దు గుమ్మల్లార! క్రొమ్మించు మించుల్లార!  ||

|| సౌందర్య రాశి స్పర్శ ఘనతలు మనము ;          ఎన్ననీ వర్ణించగలము, అమ్మలారా! || 
 


@@@@@@@@@@@@@@@@@@

sauBAgyavati padma arudeMchenammaa!  ativa padmaavati aasiinuraalavaga || sau||

pallakii – kommulaku vachchEnu kOra mIsaalu; auraura!pallakii – kommulaku vachchEnu kOra mIsaalu;immugaa I muddaraa raalichaTa kUrchonaga ||

palyaMkika gumma; maryaada miMchinadi ; aa svarga dvaaraala naahaaha! chUDarE! O muddu gummallaara! krommiMchu miMchullaara! ||

|| sauMdarya raaSi sparSa Ganatalu manamu ;            ennanii varNiMchagalamu, ammalaraa! ||
                 (amma vaari sparSa; మాత / అమ్మ వారి స్పర్శ)

@@@@@@@@@@@@@@@@@@ 

 (కర్పూర పాత్ర ఆయెనమ్మా! ముత్యాల పల్లకీ;)

Sunday, April 17, 2011

శ్రీ లక్ష్మి! జయ లక్ష్మి (భక్తి Song)




 శ్రీ లక్ష్మి! జయ లక్ష్మి!
 ధన లక్ష్మి!ఇందీవరాక్షీ!
ఇందిరా! సిరి బోణి! శ్రీ విద్యా లక్ష్మి! || 
శ్రీ లక్ష్మి! జయ లక్ష్మి! ఇందీవరాక్షీ! 
 ఇందిరా! సిరి బోణి! శ్రీ విద్యా లక్ష్మి! 
 నీరాజనం! శుభ నీరాజనం! ||

పాల సంద్రము పైన నీ నగవు హరి విల్లు; 
 అందుకే నీ కేలు అందుకొన్నాడు హరి! 
 చిలుకల కొలికిరో! జాలమ్ములేల? 
 ఆది లక్ష్మీ ధాన్య లక్ష్మి!గజ లక్ష్మి! 
 రావమ్మా! ఇటు రావమ్మా! ||

ధన ధాన్య సౌభాగ్య రాసి నీవేనమ్మ! 
శ్రీ నాథునీ రాణి! లోలాక్షి!వర లక్ష్మి! 
శ్రీ నీరధీ జాత! కలికింత కులుకేల!? 
రావమ్మా! ఇటు రావమ్మా! ||

సకల వైభోగముల మా ఇల్లు తుల తూగ 
సుస్థిరమ్ముగ కొలువు తీరంగ మా ఇంట 
 ధైర్య లక్ష్మీ దేవి!సంతాన లక్ష్మిదేవి! 
 రావమ్మా! ఇటు రావమ్మా! ||

  (జయ లక్ష్మి!ధన లక్ష్మి!సంతాన లక్ష్మిదేవి! 
    పాట ; మంగళ హారతి )


శ్రీ అష్ట లక్ష్మీ దేవీ నామావళి

1.ఆది లక్ష్మి! 
2.ధాన్య లక్ష్మి!
3.గజ లక్ష్మి!
4.ధన లక్ష్మి! 
5.శ్రీ విద్యా లక్ష్మి
6.ధైర్య లక్ష్మీ దేవి!
7.సంతాన లక్ష్మిదేవి!
8.జయ లక్ష్మి!

"అంజలా నగరము" City in Ramayana


    












మోహన్ చంద్  కరమ్ చంద్ గాంధీని ప్రభావితం చేసిన పాత్ర.
రామాయణములో శ్రవణుడు .శ్రవణుని తల్లి దండ్రులు గుడ్డి వారు.తన   జననీ జనకులను కావడిలో కూర్చుండ బెట్టి,అనేక పుణ్య తీర్థాలకు తీసుకుని వెళ్ళాడు . ఆతని గాథ, హృదయాలను కదలిస్తుంది.కర్ణ భేది విద్య తెలిసిన దశరథ మహా రాజు శ్రవణుని తల్లి దండ్రులకు తటస్థపడిన ఘటన, శ్రీమద్రామాయణ గాథకు కీలకమైన మలుపు.అమ్రితసర్ కు దగ్గర 6 కిలో మీటర్లు దూరంలో ఉన్న పట్టణము అంజలా"అంజలా నగరము"  యాత్రికులు దర్శనీయ ప్రదేశము. six kilometers from the Amritsarcity near a place called Anjala.                 అంజలా నగరము (Link)
                   $$$$$$$$$$$$$$$$$$$$$$

Tuesday, April 12, 2011

సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”


సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు” అనే పుస్తకమును రచయిత బి. సుబ్బారావు గారి  తెలుగు సాహిత్యాభిమానానికి నిలువుటద్దముగా వెలువడినది.సాహితీ సమరాంగణ సార్వభౌముని వివరాల సేకరణకై రచయిత చాలా శ్రమించారు.“తెలుగదేల యన్న దేశంబు తెలుగేను; తెలుగు వల్లభుండ తెలుగొకండ;ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి;దేశ భాషలందు తెలుగు లెస్స” అంటూ మన తెలుగు గొప్పదనాన్ని ఆంధ్రులకు అవగతం అయ్యేట్టు చేసిన క్రిష్ణ రాయలు గురించి, మరల మరల జ్ఞాపకం చేసుకోవడం అంటే – ఆంధ్ర భోజునికి ఒక చిన్న పూవుతో అర్చన చేయడమే!ప్రథమ అధ్యాయంలో “ క్రీ.శ. 1300 ప్రాంతమున దక్షిణ భారతావని స్థితి”  ని కూలంకషంగా చూపారు.వరుసగా నాలుగు రాజ్యాల గురించి చెప్పారు.యాదవ సామ్రాజ్యం( దేవ గిరి రాజధాని) ;కాకతీయ  (రాజధాని ఓరుగల్లు);హొయసల  (ద్వార సముద్రం రాజధాని) ;పాండ్య ( మధుర రాజధాని) ;ఈ నాలుగు ప్రధాన సామ్రాజ్యాలు దక్షిణ భారతావనిని, వైభవోపేతంగా విరాజిల్లుతున్నాయి.అప్పటి దాకా ఉత్తర భారత దేశానికే పరిమితంఅయిన తురుష్కులు దక్షిణ భారత సీమలలోని తుల తూచలేనంతటి సంపదలపై కన్ను పడింది.ఫలితంగా ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు.జలాలుద్దీన్ తమ్ముని కుమారుడు అల్లవుద్దీన్ ఖిల్జీ. (ఇతడు చితోడ్ రాజ్యము, రాణీ పద్మినీ దేవి సతి – ప్రాణ త్యాగమునకు కారకుడు ఐ, ప్రజలకు గుర్తుకు వస్తాడు.)జలాలుద్దిన్ కు సైన్యాధ్యక్షుడు, అలుడు కూడా .1291 లో ఢిల్లీ సుల్తాను ఆజ్ఞ లేకుండా, ధనాశతో - సుల్తానుకు తెలీకుండా , దేవగిరిపైకి దండెత్తి, గెలిచాడు. అపార ధన రాసులతో తిరిగి వెళ్ళి, తన మామ ఐన జలాలుద్దీన్ ని మట్టుబెట్టి తానే ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు.ఈ రీతిగా చిన్న విషయాలు కూడా రచయిత కలం దాటి పోకుండా, సవివరంగా ఉటంకించబడినవి.2 వ ప్రకరణంలో విద్యారణ్య స్వామి, హరి హర రాయలు, బుక్క రాయలు,    విజయ నగర సామ్రాజ్య స్థాపనము మొదలుకొని, శ్రీ కృష్ణ దేవరాయలు విజయ నగర సామ్రాజ్యనికి 1509 లో పట్టాభిషిక్తుడు ఐన ఘట్టాలను చెప్పారు.3 వ అధ్యాయంలో కృష్ణ రాయలు రాజ్యాధిపత్యము చేపట్టు నాటికి, ఆయన ముందున్న సమస్యలను, తత్ఫలితంగా – ఉదయ గిరిపై రాయలు దండయాత్ర” ఇత్యాదులను చిత్రించారు.వరుసగా రాయలు సాధించిన ఘన విజయాలను పేర్కొన్నారు. సాహిత్య పోషణలో దిశా నిర్దేసం చేసిన సామ్రాట్టు రాయలు.అష్ట దిగ్గజములు – వీరి ప్రస్తావన తిప్పలూరు శాసనం – లో ఉన్న విషయాన్ని చరిత్రకారులకూ, చదువరుల దృష్టికీ తెచ్చారు.దిగ్విజయ యాత్ర చేసిన ప్రతి చోట రాయలు, దేవళముల నిర్మాణములను గానీ, కోవెలలకు భూరి విరాళాలను ఇవ్వడము గానీ ఆచరించే వాడు.“భువన విజయము” భవన శిల్ప కళా వైభవము, రాణి వాసము,అల్లసాని పెద్దనాది కవివర్యుల పద్యాలను ఉదహరిస్తూ విజయనగర సామ్రాజ్యాధిపతి  తేజస్సును  నిరూపించారు. ఈ పొత్తములో ఉదహరించిన  పోర్చుగీస్ యాత్రికుడు డిమ్మన్ గోస్ పెయిజ్ , వాక్యాలు  “శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతి రోజు వేకువ జామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నువ్వుల నూనెతో దేహ మర్దనము చేయించుకునును. ఆ తరువాత ధోవతిని ధట్టీగా కట్టి, బరువైన దిమ్మలను చేతులతో పైకి ఎత్తుతూ, వ్యాయామము చేయును. ఆ తరువాత తన శరీరము పైనున్న నూనె ఇంకిపోయేవఱకూ కత్తి సాము చేయును. ఆ తరువాత తన వద్ద నుండు వస్తాదులతో మల్ల యుద్ధము చేయును. తదనంతరము ఒక పెద్ద మైదానములో గుఱ్ఱపు స్వారీ చేయును. (పేజీ 23) ఉపసంహారము గా , రాయలు తదనంతర పరిణామాలనూ, తళ్ళి కోట యుద్ధము జరుగుటకు కారణాలనూ, తదనంతర పరిణామాలనూ విపులీకరించారు.5 వ ప్రకరణంలో సామ్రాజ్య వైభవమును, ప్రజల జీవన శైలినీ,కళా ప్రియయ్వమునూ,పాలనా వ్యవస్థనూ సోపాన క్రమంలో పాఠకులకు కరతలామలకం చేసిన కృషికి, ఈ పుస్తకంలోని ప్రతి పుట నిదర్శనమే!శ్రీ సాయిరాం ఆఫ్ సెట్ , ఒంగోలు – వారి ముద్రణలో కవర్ పేజీ, పుస్తకములో అచ్చు తప్పులు లేవు, ముద్రణ  అందంగా ఉన్నది.సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు” .
"సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు” "                                        వెల;  Rs25/-pratulaku ;Bollapalli subba rav,   ( Retd Bank Manager), “Srinivas”) 7-2-13 Lawer Pet, 2 va vidhi, Ongole – 523002 ;ph; 08592-234262 ; Cell; 9705456900                   

Monday, April 11, 2011

లోకాభిరామా!









వినీల గగనాలకు నీ మేని సౌరులు

వరమీయుచుండును క్రొమ్మెరుగు దనములు

మా కనుపాపలే నీ కొలువు కూటములు;

కొలువు దీరుము స్వామి!లోకాభిరామా!    ||మా కనుపాపలే|| 

ఆప్త పద్మమ్ములు శ్రీ వారి పదములు;

లిప్త లిప్తకు చరణ పద్మమ్ము జాడలను; 

హత్తుకొనిన సప్త శైలమ్ములు;

తృప్తి విప్పారిన మకరంద రాశులు    ||మా కనుపాపలే|| 

కుందనపుబొమ్మ సతి పద్మావతిని జతగ; 

భక్తుల హృదయాల పుణ్య పుష్కరిణుల(లోన)
         ఉందువు శ్రీ ధామ! రాజ హంసవు నీవె!

విహరించుమోయీ!శ్రీ శ్రీనివాస!    ||మా కనుపాపలే||

మా కనుపాపలే నీ కొలువు కూటములు


వినీల గగనాలకు నీ మేని సౌరులు వరమీయుచుండును క్రొమ్మెరుగు దనములుమా కనుపాపలే నీ కొలువు కూటమ్ములు;                                                                           కొలువు దీరుము స్వామి! లోకాభిరామా!   ||మా కనుపాపలే ||         
ఆప్త పద్మమ్ములు శ్రీ వారి పదములు;లిప్త లిప్తకు చరణ పద్మమ్ము జాడలను; హత్తుకొనిన సప్త శైలమ్ములు;తృప్తి విప్పారిన మకరంద రాశులు  || మా కనుపాపలే ||      
 కుందనపుబొమ్మ సతి పద్మావతిని జతగ;  భక్తుల హృదయాల పుణ్య పుష్కరిణుల లోనఉందువు శ్రీ ధామ! రాజ హంసవు నీవె!                                                                   విహరించుమోయీ!శ్రీ శ్రీనివాస!    || మా కనుపాపలే ||   


నెల్లూరులో "తిక్కన మండపము"


విక్రమ సింహపురి అనేది నెల్లూరు కు గల ప్రాచీన నామము.
తిక్కన ఘంటము చేత పూని (stylus)ఒక మండపములో కూర్చుని,
మహా భారత రచన చేసెను.
వ్యాస మహా ముని "జయమ్"ను సంస్కృతములో వ్రాసాడు.  
కవిత్రయము ఆంధ్రీకరణతో 
మహా భారతము తెలుగు ప్రజలకు  సుపరిచితమైనది.
పెన్నా నదీ తీరాన ఈ మహా చారిత్రక సంఘటన జరిగినది.
అచ్చట "తిక్కన మండపము"
ఈ మహత్తర ఘటనకు తార్కాణంగా ఉన్నది.


       తిక్కన మండపము (Link)

రష్యన్ చిత్రకారుడు art gallery



నిచొలస్ రోరిచ్ రష్యన్
(Nicholas Roerich, 
(October 9, 1874 - 
December 13, 1947) 
చిత్రకారుడు. ఇండియా, హిమాలయాలు, టిబెట్ మున్నగు దేశాలలోని ప్రకృతి సౌందర్యాలూ, వాస్తు, ధార్మిక నిర్మాణాలూ అతనిని ఆకర్షించినవి.మలన వ్యాలీ(Malana valley) వద్ద చందర్ ఖని (Chanderkhani)దరిని నగ్గర్(Naggar) వద్ద Roerich art gallery  ఉన్నది.కులూ లోయలు, బిజిలీ మహా దేవ దేవాలయ సౌందర్యాలు ఆతని కుంచెలో జీవం తొణికిసలాడేలా చేసాయి.

A view of extended balcony of Naggar Castle and cloudy hills in he background...
Here a gallery houses the paintings of the Russian artist Nicholas Roerich
his paintigs (Link)

Sunday, April 10, 2011

ఆ 10 స్త్రీల నామములు (Ten women names)











తిరుపతిలో శ్రీ క్రిష్ణ మందిరము 
"కలియుగ వ్రేపల్లె" లా భాసిస్తూన్నది. 
ఇస్కాన్ (International Society Krishna Conciousness) వారు నిర్మించిన 
అద్భుత శ్రీ క్రిష్ణ మందిరము. 
ఈ విశాలమందిరంలో శ్రీ క్రిష్ణుడు మురళిని చేబూని విలాసంగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ స్వామికి ఇరు పక్కల అష్ట వనితలు పూ దండలు, పద్మాలనూ చేతిలో పట్టుకుని ఉన్నారు.ఈ కోవెలలో ఒక విశేషం అగుపడుతుంది. క్రిష్ణ మూర్తి వద్ద ఉన్న ఎనిమిది మంది మహిళలకు వేరే పేర్లు కలిగి ఉన్నారు. అదీ విశేషం.
మామూలుగా "అష్ట మహిషుల"నామాలు 
అందరికీ తెలిసినవి-ఇలాగ ఉన్నాయి.
రుక్మిణి, 
సత్యభామ, 
మిత్రవింద,  
జాంబవతి,
కాళింది,
నాగ్నజితి
  (నీల/ సత్య అని కూడా ఈమె పేర్లు),
భద్ర,
లక్షణ   
అంతర్జాతీయ శ్రీ క్రిష్ణ సమాజము వారి కోవెలలో ,                                                                                                         వ్రేపల్లెలో బృందావనములో నాట్య క్రీడలు ఆడిన                                                                                                            దశ భామినులు ఉన్నారు.
          ది మంది నామావళి :
తుంగ విద్య, 
సుచిత్ర, 
చంపక లత 
లలిత 
గోవిందజీ 
రాధా రాణి 
విశాఖ, 
ఇందులేఖ 
రంగ దేవి 
సుదేవి 
 పాలరాతితో నిర్మితమైన సువిశాల శ్రీ క్రిష్ణ మందిరములో అడుగడునా చిత్ర పటాలు, మురల్స్ కళలు, శిల్పాలు ఆధునిక రీతిలో అందాలను మేళవించుకున్నవి."ఇస్కాన్ గుడిని చూడ; వేయి కనులు చాలునా!"ఎంత వర్ణించినా తనివితీరని సొగసుల కలబోత ఈ దేవళము. 
Iskcon mandir అందరికీ నయనానందకరము.



               
తిరుపతిలో శ్రీ క్రిష్ణ మందిరము 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Saturday, April 9, 2011

ఆది వాసీల భాషలకు మైలు రాళ్ళు




















గోండు భాష కూడా విదేశీయుల జిజ్ఞాసను చూరగొన్నది. 30 లక్షలమందికి గోండు భాష వ్యవహారంలో ఉన్నది. మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ లోనే 10 లక్షల మంది గోండు భాషీయులు ఉన్నారంటే, ఆ భాష ప్రధానమైనదనే భావించవచ్చును. 1942-43 లలో Heman Darf "గోడు గిరిజన వాక్కులకు"ఉద్యమ స్థాయిలో సేవలను అందించారు.ఆధునిక కాలంలో మార్క్ పెన్ని, తన భార్య johanna penni,(వీరి సంతానము అభి, ప్రియ, కరీనా) సహకారంతో, గోండు భాషకు   పునరుద్ధరిస్తూ, కృషి చేస్తున్నారు. ఛార్లెస్ బ్రౌన్ వంటి Western reaserch పరిశోధనాసక్తిపరుల,గిడుగు రామమూర్తి పంతులు మున్నగు ఆంధ్రుల- సవర భాషా సేవలు ( ఆది వాసీల పలుకులకు ఆ మాటకొస్తే తెలుగు కూడా పరాయి భాషే కదా!)చిర కాలం జ్ఞాపకం ఉంచుకోవలసినవి.మన భారత దేశములోని స్థానిక, అరణ్య వాసుల,  గిరిజనుల భాషలకు విదేశీయుల అపరిమిత  పరిశ్రమ, నేటి లింగ్విస్టిక్/ భాషా శాస్త్రవేత్తల పరిశోధలకు స్ఫూర్తి నిస్తూ, అప్పట్టుల Reaserch ఆవశ్యకతను  గుర్తు చేస్తూన్నాయి కదూ!
 1. మైలు రాళ్ళు  (Link read)
 2.లింగ్విస్టిక్  స్ఫూర్తి (Link read)
 3. More matter (Link)    

పురుషోత్తమ! శ్రీ రామా!













భక్త మనో మందిర వాసా! ;
దాశరధీ! దయా సింధు!
కోదండ రామ! మా అండ ఎపుడు నీవే! ||

జలజాక్షి జానకీ నాధ,
నారాయణ! పురుషోత్తమ!
నమస్సుమాంజలి!
గైకొనుమా మా స్వామి!
శత కోటీ నమస్సుమాంజలి ||

జలద వర్ణ మోహనా!
వాల్మీకీ సన్నుత!
నమస్సుమాంజలి!
గైకొనుమా మా స్వామి!
శత కోటీ నమస్సుమాంజలి   ||

 (పురుషోత్తమ! శ్రీ రామా!)

&&&&&&&&&&&&&&&&&&&&


            purushOttama! SrI raamaa!




















Bakta manO maMdira vaasaa! ; 
daaSaradhI! dayaa siMdhu! 
kOdaMDa raama! maa aMDa epuDu nIvE! ||


jalajaakshi jaanakI naadha,  
naaraayaNa! purushOttama! ;; 
namassumAMjali! 
gaikonumaa maa svaami!
Sata kOTii namassumAMjali   ||


jalada varNa mOhanaa! 
vaalmIkii sannuta! 
gaikonumaa maa svaami!
Sata kOTii namassumAMjali   ||

&&&&&&&&&&&&&&&&&&


84 – 252 లీలా గాథలు (84-252 vaishnav vartas ) 
వైష్ణవ భక్తి సామ్రాజ్యములో వినుతి గాంచినవి.
తులసీ దాసు యొక్క సోదరుడు నందనార్  అనే భక్తుని చరిత్ర, 
ఆ యా కథల వలన లోక విదితమైనది.

 तुलसी मस्तक तब नमे, धनुष बान लेहु हाथ
Tulsidas will only bow 
when you will grasp the bow & arrows in your hands.

बरनौ अवध श्रीगोकुल गाम, उत बिराजत जानकी-वर, इतही श्यामा-श्याम
Glory to Gokul because the Lord of Sita, 
my Rama resides here as Krishna & Radha…




    See ; LINK ::::::
    
      తులసీ దాసు యొక్క సోదరుడు నందనార్


    bhakta naMdanar , brother tulasi das  

Friday, April 8, 2011

శత కోటి నామాలు కల స్వామి





















ముక్కోటి సామగ్రి సరి పోవునా?
నీకున్న పేర్లేమొ శత కోటీ!
స్వామి! నీకు పూజలు చేయ ||

పువులు, పత్రి,
జలము, అక్షింతలు;
ఎన్ననీ తేగలను? ఎన్నికగ మా స్వామి! ||

చందన,పన్నీర్లు,
అత్తరుల బిందువులు  
ముక్కోటి సామగ్రి సరి పోవునా?
ఎన్ననీ తేగలను? మన్నికగ మా స్వామి! ||

&&&&&&&&&&&&&&

   Sata kOTi naamaalu kala svaami
  __________________________




















mukkOTi saamagri sari pOvunA? ;  
nIkunna pErlEmo Sata kOTI! : 
svaami! nIku pUjalu chEya ||


puvulu, patri, jalamu; akshiMtalu; 
ennanii tEgalanu?  
ennikaga maa svaami! ||


chaMdana, pannIrlu,
attarula biMduvulu ; 
mukkOTi saamagri sari pOvunA? ;
ennanii tEgalanu? 
mannikaga maa svaami! ||  

&&&&&&&&&&&&&&&&&&&&

నీ గాథలు లోక కళ్యాణ కరములు క్రిష్ణా!





















మాకందించిన నీ లీలల గాథలు; 
లోక కళ్యాణ కరములు క్రిష్ణా! ||

మన్నుల పొర్లి, కొమ్మల ఊగి; 
కందెను కన్నని కర కమలములు – అని, 
కలత చెందినది యశోదమ్మ
కన్న తల్లి కింత శోధనయా?
దయ ఏదయ్యా? నీ హృదయములో? ||

కాళియ నాగము పడగలు పట్టిన ;
పల్లవాంగుళులు కందినవనుచూ ;
గోపెమ్మలు ఎంతో విల విలలాడిరి 
భక్తుల కేలనొ వేదనలు? ||

మురళిని ఊదెడు కెంపుపెదవులు
కందినవనుచూ రాధా దేవి; 
ఖేదము నొందెను నిలువెల్లా 
చివురుటాకుగా రెప రెపలాడెను ||

మాకందించిన నీ లీలల గాథలు; 
లోక కళ్యాణ కరములు క్రిష్ణా!


&&&&&&&&&&&&&&&&&&&&&&&&




















pallavaamguLulu kaMdinavanuchuu ; 

gOpemmalu eMtO vila vilalADiriBaktula kElano vEdanalu? || 

muraLini UdeDu keMpupedavulu ; kaMdinavanuchU ; raadhaa dEvi KEdamu noMdenu niluvellaa chivuruTAkugaa repa repalaaDenu ||

maakaMdiMchina nI lIlala gaathalu; lOka kaLyaaNa karamulu krishNA!


Thursday, April 7, 2011

ఉర్వి శ్రీ కల్ప వల్లి ||
















వ్రేపల్లె, ద్వారక, మధురా పురి
పుడమి అంతటికీ శ్రీ కల్ప వల్లి ||

గోప భామినులు చల్ల చల్లని వేళ ;బయలుదేరేసి;
         చల్ల చల్లోయమ్మ చల్లలని అమ్మగా బయలుదేరేసి;
         పలుకుల పన్నీరు చిలకింప జేసేసి ||

చిన్న రాయి వచ్చి కడవను తాకేసి , 
భళ్ళుమని/ను సడి సేసి చల్లలొలకంగా;  
అవి తలంబ్రాలంటు; నవ్వు వినిపించీ..... ||
"ఆ నగవులెవరివీ? ఓసోసి!"
పాలు, వెన్నలు ఒలికి; మీగడల తరకలతొ;   
మేఘాల నింగీ ఆయెనమ్మా! దారి ఓసోసి! ||