Saturday, April 9, 2011

ఆది వాసీల భాషలకు మైలు రాళ్ళు




















గోండు భాష కూడా విదేశీయుల జిజ్ఞాసను చూరగొన్నది. 30 లక్షలమందికి గోండు భాష వ్యవహారంలో ఉన్నది. మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ లోనే 10 లక్షల మంది గోండు భాషీయులు ఉన్నారంటే, ఆ భాష ప్రధానమైనదనే భావించవచ్చును. 1942-43 లలో Heman Darf "గోడు గిరిజన వాక్కులకు"ఉద్యమ స్థాయిలో సేవలను అందించారు.ఆధునిక కాలంలో మార్క్ పెన్ని, తన భార్య johanna penni,(వీరి సంతానము అభి, ప్రియ, కరీనా) సహకారంతో, గోండు భాషకు   పునరుద్ధరిస్తూ, కృషి చేస్తున్నారు. ఛార్లెస్ బ్రౌన్ వంటి Western reaserch పరిశోధనాసక్తిపరుల,గిడుగు రామమూర్తి పంతులు మున్నగు ఆంధ్రుల- సవర భాషా సేవలు ( ఆది వాసీల పలుకులకు ఆ మాటకొస్తే తెలుగు కూడా పరాయి భాషే కదా!)చిర కాలం జ్ఞాపకం ఉంచుకోవలసినవి.మన భారత దేశములోని స్థానిక, అరణ్య వాసుల,  గిరిజనుల భాషలకు విదేశీయుల అపరిమిత  పరిశ్రమ, నేటి లింగ్విస్టిక్/ భాషా శాస్త్రవేత్తల పరిశోధలకు స్ఫూర్తి నిస్తూ, అప్పట్టుల Reaserch ఆవశ్యకతను  గుర్తు చేస్తూన్నాయి కదూ!
 1. మైలు రాళ్ళు  (Link read)
 2.లింగ్విస్టిక్  స్ఫూర్తి (Link read)
 3. More matter (Link)    

No comments:

Post a Comment