మాకందించిన నీ లీలల గాథలు;
లోక కళ్యాణ కరములు క్రిష్ణా! ||
మన్నుల పొర్లి, కొమ్మల ఊగి;
మన్నుల పొర్లి, కొమ్మల ఊగి;
కందెను కన్నని కర కమలములు – అని,
కలత చెందినది యశోదమ్మ
కన్న తల్లి కింత శోధనయా?
దయ ఏదయ్యా? నీ హృదయములో? ||
కాళియ నాగము పడగలు పట్టిన ;
కాళియ నాగము పడగలు పట్టిన ;
పల్లవాంగుళులు కందినవనుచూ ;
గోపెమ్మలు ఎంతో విల విలలాడిరి
భక్తుల కేలనొ వేదనలు? ||
మురళిని ఊదెడు కెంపుపెదవులు
కందినవనుచూ రాధా దేవి;
ఖేదము నొందెను నిలువెల్లా
చివురుటాకుగా రెప రెపలాడెను ||
మాకందించిన నీ లీలల గాథలు;
లోక కళ్యాణ కరములు క్రిష్ణా!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
pallavaamguLulu kaMdinavanuchuu ;
gOpemmalu eMtO vila vilalADiriBaktula kElano vEdanalu? ||
muraLini UdeDu keMpupedavulu ; kaMdinavanuchU ; raadhaa dEvi KEdamu noMdenu niluvellaa chivuruTAkugaa repa repalaaDenu ||
maakaMdiMchina nI lIlala gaathalu; lOka kaLyaaNa karamulu krishNA!
No comments:
Post a Comment