Sunday, April 10, 2011

ఆ 10 స్త్రీల నామములు (Ten women names)











తిరుపతిలో శ్రీ క్రిష్ణ మందిరము 
"కలియుగ వ్రేపల్లె" లా భాసిస్తూన్నది. 
ఇస్కాన్ (International Society Krishna Conciousness) వారు నిర్మించిన 
అద్భుత శ్రీ క్రిష్ణ మందిరము. 
ఈ విశాలమందిరంలో శ్రీ క్రిష్ణుడు మురళిని చేబూని విలాసంగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ స్వామికి ఇరు పక్కల అష్ట వనితలు పూ దండలు, పద్మాలనూ చేతిలో పట్టుకుని ఉన్నారు.ఈ కోవెలలో ఒక విశేషం అగుపడుతుంది. క్రిష్ణ మూర్తి వద్ద ఉన్న ఎనిమిది మంది మహిళలకు వేరే పేర్లు కలిగి ఉన్నారు. అదీ విశేషం.
మామూలుగా "అష్ట మహిషుల"నామాలు 
అందరికీ తెలిసినవి-ఇలాగ ఉన్నాయి.
రుక్మిణి, 
సత్యభామ, 
మిత్రవింద,  
జాంబవతి,
కాళింది,
నాగ్నజితి
  (నీల/ సత్య అని కూడా ఈమె పేర్లు),
భద్ర,
లక్షణ   
అంతర్జాతీయ శ్రీ క్రిష్ణ సమాజము వారి కోవెలలో ,                                                                                                         వ్రేపల్లెలో బృందావనములో నాట్య క్రీడలు ఆడిన                                                                                                            దశ భామినులు ఉన్నారు.
          ది మంది నామావళి :
తుంగ విద్య, 
సుచిత్ర, 
చంపక లత 
లలిత 
గోవిందజీ 
రాధా రాణి 
విశాఖ, 
ఇందులేఖ 
రంగ దేవి 
సుదేవి 
 పాలరాతితో నిర్మితమైన సువిశాల శ్రీ క్రిష్ణ మందిరములో అడుగడునా చిత్ర పటాలు, మురల్స్ కళలు, శిల్పాలు ఆధునిక రీతిలో అందాలను మేళవించుకున్నవి."ఇస్కాన్ గుడిని చూడ; వేయి కనులు చాలునా!"ఎంత వర్ణించినా తనివితీరని సొగసుల కలబోత ఈ దేవళము. 
Iskcon mandir అందరికీ నయనానందకరము.



               
తిరుపతిలో శ్రీ క్రిష్ణ మందిరము 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment