Sunday, April 24, 2011

వాన హార తంత్రులు





















మేఘాల తేరులోన;
రారండీ! మెరుపుల్లార! ;
మిరుమిట్ల దామినులు;
అందాలకు కేంద్ర బిందులు; ||

తళ తళల విద్యుల్లతలు;
చీకట్లకు ఉలికిపాట్లు
కారు చీకట్లకు జడిపింపులు;
రా రండి! సౌదామినులూ!

మేఘాలకు గుమ్మాలు;
మీరు- వర్షాలకు దారాలు

వర్స్ఘ ధార పుష్పాలను
కట్టినట్టి దారాలు


వాన పూల తోరణాలను;
ఈ భువికి - ఒసగే ఉపకారులు
మీరే! ఓ తటిల్లతలు!
రారండీ మెరుపులార!;


మీ, సౌహార్ద్రత ఏరువాక;
కర్షక జనామోద వేడుక;
ఈ సంబరాల పుడమికి
స్వాగతమిదె! రండి సుస్వాగతము!


@@@@@@@@@@@@@@@@

mEGAla tErulOna;
raaraMDI! merupullaara! ;
mirumiTla daaminulu;
aMdaalaku kEMdra biMdulu;

taLa taLala vidyullatalu;
chIkaTlaku ;ulikipATulu;
kaaru chIkaTlaku; jaDipiMpulu;

mEGAlaku gummaalu;
mIru- varshaalaku daaraalu;
vaana pUla tOraNAlanu;
I Buviki osagETi;
upakaarulu mIrEnammaa!

O taTillatalaaraa/ra!
raaraMDI merupulaara!;
raa raMDi saudaaminuluu!;
mI, sauhaardrata Eruvaaka;
karshaka janaamOda saMbaraala vEDuka;
mI valanane/nE svaagatamide/mu!ide miiku!


 మేఘాలకు గుమ్మాలు (Link 1)


మబ్బులు,మబ్బులు
దూది మబ్బులు,నీలి మబ్బులు
ఛప్పన్నారు దేశాలన్నీ ;
చుట్టి వచ్చిన చిత్రపు మబ్బులు


No comments:

Post a Comment