Thursday, April 7, 2011

ఉర్వి శ్రీ కల్ప వల్లి ||
















వ్రేపల్లె, ద్వారక, మధురా పురి
పుడమి అంతటికీ శ్రీ కల్ప వల్లి ||

గోప భామినులు చల్ల చల్లని వేళ ;బయలుదేరేసి;
         చల్ల చల్లోయమ్మ చల్లలని అమ్మగా బయలుదేరేసి;
         పలుకుల పన్నీరు చిలకింప జేసేసి ||

చిన్న రాయి వచ్చి కడవను తాకేసి , 
భళ్ళుమని/ను సడి సేసి చల్లలొలకంగా;  
అవి తలంబ్రాలంటు; నవ్వు వినిపించీ..... ||
"ఆ నగవులెవరివీ? ఓసోసి!"
పాలు, వెన్నలు ఒలికి; మీగడల తరకలతొ;   
మేఘాల నింగీ ఆయెనమ్మా! దారి ఓసోసి! ||

No comments:

Post a Comment