Tuesday, January 11, 2011

కవితల చెక్కిలి బంగరు రజనులు;;;;;;;;;;;

మబ్బులు,మబ్బులు, మబ్బులు
దుబ్బుల మబ్బులు దబ్బున వచ్చెను
మెత్తని మబ్బులు మెత్తల మబ్బులు,
తొలకరి ఆటల ముద్దుగ వచ్చెను ||

మబ్బులు,మబ్బులు
దూది మబ్బులు,నీలి మబ్బులు
ఛప్పన్నారు దేశాలన్నీ ;
చుట్టి వచ్చిన చిత్రపు మబ్బులు ||

నెమలి నాట్యముల ప్రేక్షకులు!
మల్లీశ్వరికి నేస్తాలు,
దేవుల పల్లి కలము కజ్జలముల్
చిటికెల చిందుల చెంగున వచ్చెను ||

కాళిదాసుని కవితల పల్లకీ
ధవళపు మబ్బులు
"మేఘ సందేశము" ఒడిలో బాలలు
కవితల చెక్కిలి బంగరు రజనులు ||

మిల మిల తారల చుట్టాలు;
తళుక్కు మెరుపుల నేస్తాలు
వాన చినుకుల పందిరులు
గగనపు పౌడరు పఫ్(=puf) లు మబ్బులు ||

No comments:

Post a Comment