శ్రీ లక్ష్మి! జయ లక్ష్మి!
ధన లక్ష్మి!ఇందీవరాక్షీ!
ఇందిరా! సిరి బోణి! శ్రీ విద్యా లక్ష్మి! ||
శ్రీ లక్ష్మి! జయ లక్ష్మి! ఇందీవరాక్షీ!
ఇందిరా! సిరి బోణి! శ్రీ విద్యా లక్ష్మి!
నీరాజనం! శుభ నీరాజనం! ||
పాల సంద్రము పైన నీ నగవు హరి విల్లు;
అందుకే నీ కేలు అందుకొన్నాడు హరి!
చిలుకల కొలికిరో! జాలమ్ములేల?
ఆది లక్ష్మీ ధాన్య లక్ష్మి!గజ లక్ష్మి!
రావమ్మా! ఇటు రావమ్మా! ||
ధన ధాన్య సౌభాగ్య రాసి నీవేనమ్మ!
శ్రీ నాథునీ రాణి! లోలాక్షి!వర లక్ష్మి!
శ్రీ నీరధీ జాత! కలికింత కులుకేల!?
రావమ్మా! ఇటు రావమ్మా! ||
సకల వైభోగముల మా ఇల్లు తుల తూగ
సుస్థిరమ్ముగ కొలువు తీరంగ మా ఇంట
ధైర్య లక్ష్మీ దేవి!సంతాన లక్ష్మిదేవి!
రావమ్మా! ఇటు రావమ్మా! ||
(జయ లక్ష్మి!ధన లక్ష్మి!సంతాన లక్ష్మిదేవి!
పాట ; మంగళ హారతి )
శ్రీ అష్ట లక్ష్మీ దేవీ నామావళి
1.ఆది లక్ష్మి!
2.ధాన్య లక్ష్మి!
3.గజ లక్ష్మి!
4.ధన లక్ష్మి!
5.శ్రీ విద్యా లక్ష్మి
6.ధైర్య లక్ష్మీ దేవి!
7.సంతాన లక్ష్మిదేవి!
8.జయ లక్ష్మి!
No comments:
Post a Comment