Tuesday, April 26, 2011

దివిని మించిన దుర్గమారణ్యాలు


రామ! రామ! అను మంత్రము - కారడవికి దొరికెను
అరణ్యములు దివి సొగసుకు ప్రతిమలుగా తనరెను ||

చిలక పలుకులన్ని కూడ - తీపి తేనెలెటులైనవి?
"రామ! రామ!" అనుచు సదా - ఒకే ధ్యానమయెను కద! ||

ముని జనుల సమ్మోహన కరమైన మంత్రము-
మౌని పెదవులు గాన మందిరములే ఆయెను ||

కాననమున దారులన్ని పద్మమయములాయెను;
బాటలన్ని భక్త గాన తోరణములై నిలిచెను ||

    photo  (Link 1)

@@@@@@@@@@@@@@@@@@@@@@






















kaaraDaviki dorikenu
araNyamulu divi sogasuku
pratimalugaa tanarenu   ||

chilaka palukulanni kUDa -
tIpi tEneleTulainavi?
"raama! raama!"anuchu sadaa -
okE dhyaanamaayenu kada!  ||

muni janula sammOhana karamaina maMtramu-
mauni pedavi gaana maMdiramau viMtaraa!

kaananamuna daarulanni
padmamayamulaayenu;
baaTalanni bhakta gaana
pU tOraNamulai nilichenu  ||

దివిని మించిన దుర్గమారణ్యాలు  

No comments:

Post a Comment