మదిని వీణగా మలచి, మధు గీతిగ తాను మారు ;
మంచి నీమములకు* మారు పేరు
రామ నామము, శ్రీ రామ నామము ||
తొలకరి చిరు జల్లుగా వర్షించే నామము
రామ నామము, శ్రీ రామ నామము;
విపినములను నవ్య నందనములొనర్చె -
రామ నామము, శ్రీ రామ నామము ||
కపివరులకు కట్టుబాట్లు నేర్పినదీ -
రామ నామము, శ్రీ రామ నామము;
కానలందు శబరి భక్తి(ని) – ఏరువాక చేసినదీ -
రామ నామము, శ్రీ రామ నామ ము ||
మదిని వీణగా మలచి, మధు గీతిగ మారునది -
రామ నామము, శ్రీ రామ నామము ||
&&&&&&&&&&&&&&&&&&&&&
kaTTubaaTlu kapiki nErpina naamamu
madini vINagaa malachi,
madhu giitiga taanu maaru;
maMchi nImamulaku* maaru pEru
raama naamamu, SrI raama naamamu |||
maMchi nImamulaku* maaru pEru
raama naamamu, SrI raama naamamu ||
tolakari chiru jallugaa varshiMchE naamamu,
raama naamamu, SrI raama naamamu ;
vipinamulanu navya naMdanamulonarche -
raama naamamu, SrI raama naamamu; ||
kapivarulaku kaTTubaaTlu nErpinadii -
raama naamamu, SrI raama naamamu;
kaanalaMdu Sabari Bakti – Eruvaaka chEsinadii -
raama naamamu, SrI raama naama mu;; ||
madini vINagaa malachi, madhu giitiga maarunadi -
raama naamamu SrI raama naamamu ||
No comments:
Post a Comment