Saturday, April 30, 2011

విమల రూపిణి వీణా ధారిణి
;;;;;;;;;;; 
వాగీశు పత్నీ! వర దాయినీ!
లావణ్య  దరహాసినీ!; స్మిత వీచి సంధాయినీ! ||

తెలి కలువ పుష్పాల; మృదు పరాగములుగా ; 
శాంతి సౌభాగ్యాలతో విరబూయించుచూ ;  
బాగైన విద్యలు ;ముజ్జగములకును  ; 
నీ అనుగ్రహముచే లభియించెనమ్మా! || 

చేత పుస్తకము, మాల, వర వీణతో;
విమల రూపిణిగా;వెలసి ఈ వసుధపైన ;
బుద్ధి సామ్రాజ్యాల నిచ్చు చున్నావమ్మ!;  
లావణ్య  దరహాసినీ!; స్మిత వీచి సంధాయినీ! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&


No comments:

Post a Comment