Monday, April 11, 2011

మా కనుపాపలే నీ కొలువు కూటములు


వినీల గగనాలకు నీ మేని సౌరులు వరమీయుచుండును క్రొమ్మెరుగు దనములుమా కనుపాపలే నీ కొలువు కూటమ్ములు;                                                                           కొలువు దీరుము స్వామి! లోకాభిరామా!   ||మా కనుపాపలే ||         
ఆప్త పద్మమ్ములు శ్రీ వారి పదములు;లిప్త లిప్తకు చరణ పద్మమ్ము జాడలను; హత్తుకొనిన సప్త శైలమ్ములు;తృప్తి విప్పారిన మకరంద రాశులు  || మా కనుపాపలే ||      
 కుందనపుబొమ్మ సతి పద్మావతిని జతగ;  భక్తుల హృదయాల పుణ్య పుష్కరిణుల లోనఉందువు శ్రీ ధామ! రాజ హంసవు నీవె!                                                                   విహరించుమోయీ!శ్రీ శ్రీనివాస!    || మా కనుపాపలే ||   


No comments:

Post a Comment