శ్రీ క్రిష్ణ "శ్రీ నామ రచనల నోము"ను
పట్టినది ప్రకృతి భక్తి భావనలకు ఆకృతి ||
గోప భామినులు
నడుముల కడవల
చల్లలు చిందగా;;;
బాటలన్నీ పాల కడలులూ ఆయేను
మార్గములు పట్టినవి
శ్రీ నామ రచనల నోములు ||
గగనము పట్టెను ;
మేఘాల పొత్తములు;
మబ్బు పుటలందున;
మెరుపుల లిపులతో;
శ్రీ నామ రచనల నోములను తీర్చేను అంబరము ||
No comments:
Post a Comment