Wednesday, October 1, 2014

గోముగా అడిగేము!

హైమవతి! గౌరీ!పరమేశ్వరీ! 
అర్ధనారీశ్వరీ! జగదీశ్వరీ! 
జయ జయ జోతలు 
జయ జయ జోతలు  || 

గోముగా అడిగేము! ఈ పగిదిని;
చందనము చలువల ప్రేమావధుల 
విస్తారమైనట్టి చిత్రలేఖలుగా
మల్లియల తావుల ఘుమఘుమల రీతిగా ; 
మార్చుమా ఈ సృష్టిని! 
శ్రీశక్తి! పార్వతీ! పరమేశ్వరీ! ||  

ఈరేడు లోకములు మత్తు నిద్దుర వీడ 
నీ వీక్షణములను ప్రసరించవమ్మా! ||
నీ చల్లనిచూపులవెన్నెలలు విప్పార;  
నెమలి ఆయెను జగతి; నాట్యచైతన్యాల ప్రగతి ||

కదంబముల తోపులో నటరాజదేవేరి;
ఆడుతూ పాడుతూ సాగేవు పూ దారి;
కన్నతల్లివి నీవు విమల విశ్వాలకు; 
మా - బహు పరాకులను 
వైళమే శ్రీమాత! అందుకోవమ్మా! ||  

*****************************,


  


కాదంబరికుసుమాంబ  కాదంబరికుసుమాంబ  
Telugu Ratna Malika
Pageview chart 3715 pageviews - 117 posts, last published on Oct 1, 2014
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 53174 pageviews - 996 posts, last published on Sep 30, 2014 - 2 followers
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 27997 pageviews - 729 posts, last published on Sep 30, 2014 

No comments:

Post a Comment