Tuesday, October 21, 2014

హ్యాపీ దీపావళి

చిరునవ్వులకు మేలిమి పసిడి చిరునామా;
విచ్చేసింది దీపావళి; వచ్చేసింది దీపావళి;
Happy diwali  Happy Happy dipAwaLi ||

ఇంతులు, పిల్లలు, పురుషులు, పెద్దలు;
చేతులు కలిపిన చప్పట్లు; ఆనందాల హడావుడి;
ఔ నండీ! ఇది దీపావళి, దివ్య దీపావళి ||

భాషాభేదాల్, విద్వేషాలను;
మరిపించే ప్రమిదల పండుగ - దీపావళి||
మతాబాలతో బాతాఖానీ!
రవ్వలజిలుగుల హంగామా - దీపావళి||

వెలుగుల కులుకులు;
తళుకుల హొయలులు;
ఇలపై తారలు దిగి వచ్చేటి;
దివ్య పర్వము దీపావళి||  
;
Happy Diwali 

తమాషా హమేషా దీపావళి ;
Happy Happy దీపావళి!
హ్యాపీ హ్యాపీ దీపావళి

No comments:

Post a Comment