Tuesday, September 30, 2014

మణి మకుట ధారిణీ!

మణి మకుట ధారిణీ! 
పావన కదంబ వన రాణి 
ధారుణి జననీ, శర్వాణి!  
ఓమ్ కారరూపిణీ; ఓమ్ బిందురూపిణీ ||  

కుందనపు బొమ్మా! అమ్మా!
మాకెల్లరకు తల్లివి నీవు
బొమ్మలకొలువున బొమ్మవై నిలిచి
మాకు బిడ్డవు నేడు నీవు ఐనావు||

నెలవంక సిగపైన దాల్చినావు మాత!    
నీదు -నవ్వు వెన్నెల డోలలందు తానూగును;
ఎలమి నెలవంక తూగాడును; 
జాబిల్లి మోదములు నీకు ఆమోదములు;  
సమ్మోహనము ఆయె నీ చిత్రరచనమ్ములు || 














No comments:

Post a Comment