Wednesday, October 1, 2014

రాగరాగిణి

షోడశోపచారముల వెలుగులల్లికలు; 
అల్లిబిల్లిగ మాదు ఆహ్లాదములు కోటి
నీ సన్నిధి తల్లి! అనుగ్రహము వీటిక!*  ||  

ఊసులకు నీవు మౌనవీణియవు; 
మౌనములకు నీవు రాగరాగిణివి;  
లాలిత్యకళలకు మహదేవి! మూలమైనావు || 

నీ కాలిమువ్వలు చతుష్షష్ఠి నెలవుల్లు;  
గజ్జెలు, అందియలు, మువ్వల ముచ్చటల; 
పదహారులోకముల బొమ్మల కొలువు || 

*********************************,

వీటిక* = వీడు = ప్రాంతము -
"కొండవీడు", హలైబీడు, & 
మునివాటిక - మొదలైన పదావళి         

No comments:

Post a Comment