Friday, February 1, 2013

కొల్లమ్ = "మిరియాలు", Quilon

 కేరళలో వర్ణభరిత పర్వదినము కొల్లమ్ పూరమ్ ( Kollam Pooram)      
అనేక   ఏనుగులు అలంకృతమై, ఉత్సవ వేడుకలలో ప్రదర్శితమౌతాయి.
ఇసుకవేస్తే నేల రాలనంత జనము ఇక్కడికి వస్తారు .
( 1 )  శ్రీ క్రిష్ణస్వామి కోవెలలో ( Asramam Sri Krishnaswamy Temple,  )
ఈ పండుగ ఘనంగా జరుపుతారు. కేరళలోని పుణ్య క్షేత్రాలు సందడిగా ఉంటాయి.
కూడమాట్టం పండుగ(`కుదమత్తొం ') కై- ముప్ఫై మంది మావటీడులు పాల్గొంటారు.
15 మంది చొప్పున రెండు వర్గాలుగా ఈ 30 టుస్కెర్స్ విభజించబడుతారు. 

1 }ఒక గ్రూపు టస్కర్లు- శ్రీ తామరకులమ్ శ్రీ మహాగణపతి కోవెల టీము
(ఠమరకులం శ్రి ంఅహగనపథ్య్ టెంప్లె తేం ) ;
2  }రెండవ టీము - పుథియకావు భగవతి ఆలయము టీము
( Puthiyakavu Bhagawathy Temple team )
కూడమాట్టం పండుగ (`kudamattom ')
జాతీయ పండుగ- గా 
పరిగణించదగిన స్థాయి గల గొప్ప పండుగ - అని అభిజ్ఞుల అభిప్రాయము.                         
సాంప్రదాయబద్ధముగా దరువులు , మేళమ్ లు వైభవముతో "కూడమాట్టమ్" జరుగుతుంది.
ఆ సందర్భములో బాణాసంచాల హడావుడి- ప్రజలకు నయనపర్వము చేస్తుంది.

                  కొల్లమ్

"కొల్లమ్" అనే మలయాళ పదమునకు "మిరియాలు" అని అర్ధము.
సుగంధ ద్రవ్యాలలో - "మిరియములు" ది (spices, pepper) అగ్రస్థానము.
తెలుగులో "కారాలూ, మిరియాలూ నూరుతున్నాడు" నే జాతీయ ప్రయోగము ఉన్నది.
కొల్లమ్ - సంస్కృత పదము.
కొల్లమ్ పంట 'కో కొల్లలుగా' పండుతూన్నందుచేత - 
ఈ సీమకు "కొల్లమ్" అనే పేరు వచ్చినది.  
 
క్రీస్తు పూర్వము  125 (=  ౧౨౫ ) నుండి 
ఆరంభమైన కొల్లమ్  శకము ను ఇక్కడ ఆదరిస్తారు.
చిప్లన్ నగరిలో పరశురాముడు - రచించిన కొల్లమ్ కేలండర్ ను - 
కొల్లమ్ సీమా జనులు అనుసరిస్తారు.
 ( ('God's Own Country'; banks of the Ashtamudi in Kerala )  

కొల్లమ్ పట్టణము, జిల్లా ప్రాంతము - అష్టముడి తీరమున ఉన్న అందమైన సీమ.
సొగసులకు నెలవైన కేరళకు -
"భగవానుని ధామము" - అని కీర్తి వచ్చినది.

కొల్లమ్ మండలము; పూర్వ నామము
ఆంగ్లేయులు "క్విలోన్ ("Quilon") అని - కొల్లమ్ ను  పిలిచారు.

కేరళ రాష్ట్రములో ~ కొల్లమ్ ప్రధాన వాణిజ్య, ఆర్ధిక కేంద్రము. 

కేరళలో నాలుగు పెద్ద నగరములు :-

 అవి  1) త్రివేండ్రమ్, 2) ఎర్నాకుళమ్, 3) కోఝికోడ్, 4) కొల్లమ్   
;















;
Tags:-
Ilanjithara melam,
elephant show
Kollam Pooram 




మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్

No comments:

Post a Comment