Monday, December 24, 2012

గరుడీయ, మాల్ దీవుల ఫుడ్


తెలుగులో “ములక్కాయ”/ ములగ కాడ:
ములగాకు కూర ఆరోగ్యవర్ధినిగా తలుస్తారు.
ప్రత్యేక సందర్భాలలో ములగ ఆకు కూరను చేసుకుంటూంటారు.
మలయాళము లో “మురింగా”:
సంస్కృతములో “సురజన”: పంజాబీలో కూడా “సురజన”:
ఒరియా: సజనా/ సుజన:
హిందీలో “సహ్ జన్”>  (सहजन) :
ఇంగ్లీష్ లో “డ్రమ్ స్టిక్”:
ఆఫ్రికా దేశాలలో ములగ కాయ విత్తనాలతో -
కాలుష్య జలములను - వాడుకునే మంచి నీళ్ళుగా మార్చుతున్నారు


*************************;

5 వేల యేళ్ళ నుండీ హిందువులు
భోజనములో నిత్యమూ వాడే కూరగా పరిచితమే!
వేలాది ఏళ్ళుగా ఆయుర్వేదవైద్యములో ఉపయోగితమౌతూన్నది.
ములగ నూనెను మధ్య ప్రాచ్య దేశాలలో వాడుతారు.
ప్రాచీన ఈజిప్టు ప్రజలు, గ్రీకు వారు,
రోమన్లు ములగ తైలమును హెల్త్ రక్షిణిగానూ, కాస్మోటిక్సులలోనూ వాడ్తూండేవాళ్ళు.
ములగ విత్తులనుండీ నూనెను సులభముగానే తీయగలగడము వలన
ఈ ఆచరణ సాధ్యమైనది. పశువుల మేతలో కూడా
ఈ సహ్ జన్ (सहजन) - ఉపయుక్తము.

*************************;


బెన్ ఆయిల్  Ben Oil Tree అని జమైకా లో పిలిచే చెట్టే "ములగ చెట్టు".
జమైకా దేశంలో ములగ రెమ్మల, కణుపుల నుండి
నీలి రంగు రసాన్ని తయారు చేసి,
వస్త్రాలకు,  అద్దకం వలె వాడుతారు.
(In Jamaica, the sap is used for a blue dye.)               
బెన్ ఆయిల్ ములగ తరువు నుండి కలిగే ఉత్పాదన.
బెన్ ఆయిల్ ట్రీ - అని దీనిని పిలుస్తున్నారు - అంటే
ఆ తైలమునకు ప్రపంచములోని  మార్కెట్ పరిధిని అంచనా వేయవచ్చును.
తమిళనాడు, కేరళ ఇత్యాది రాష్ట్రాలలో ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానాలలో
ఈ ములగ నూనె (Ben oil) వాడబడ్తూన్నది.

*************************;

Drumstick flowers

ములక్కాయ సాంబారు
మన దక్షిణాది ఆహారములో కంపల్సరీ ఐనదీ అంటే
ఆ రుచినిగూర్చి వేరే చెప్పక్కర్లేదు.
ములక్కాయ కూటు, కూరలు కూడా అందరికీ నచ్చినవే!

తునా చేపలు, కొన్ని దినుసులతో చేసే వంటకము పేరు "గరుడీయ". 
ఇది మాల్ దీవులలోని ట్రెడిషనల్   వంటకము.
గరుడీయ - అనే సాంప్రదాయ (ములగ) వంటకము 
మాల్ దీవులలోని ప్రజలకు ప్రీతిపాత్రమైనది.
నేటికీ Maldivians people ఇష్టంగా తినే వంటకం Garudiya.
గరుడీయ dish, Maldivian cuisine  (Link: Wikii pediya)

;Ben Oil Tree అని జమైకా, A wanita
(Friday, August 26, 2011 ములగ చెట్టు ప్రయోజనాలు):-

ఆఫ్రికా దేశాలలో ములగ కాయ విత్తనాలతో - కాలుష్య జలములను -
వాడుకునే మంచి నీళ్ళుగా మార్చుతున్నారు.
రుబ్బిన/ గ్రైండ్ చేసిన ములక్కాయ విత్తుల గుజ్జును రెడీ చేస్తారు.
ఆ Moringa seeds పిండిని 2 స్పూన్లు తీసుకుని,
సీసా నీటిలో లో బాగా కలియబెడ్తారు.

ఆ ద్రావణము కలుష జలాలను శుద్ధి చేయడానికై ఉపయోగపడ్తుంది. Drustick/Horseradish:-

http://www.asia.ru/en/ProductInfo/522228.html
TreeWater Treatment with Moringa Seeds
No comments:

Post a Comment