Monday, December 24, 2012

హుందా తనముల పెళ్ళి పెద్దలు


లగ్న పత్రికను పుచ్చుకునీ,
బయలుదేరినది విశాలాంబరము;
ప్రకృతి దేవుడు సొగసుల వరుడు;
పుడమి చక్కనీ నవీన వధువు;
మంచిగ జోడీ కుదిరినది,
అవశ్యమిపుడే పెళ్ళి చేతము;

పంటల బంగరు పల్లకి ఇదిగో!
కుందన బొమ్మలు కూర్చోండి!
మెరుపుల దండలు వేస్తాము;
ఉరుముల వాద్యాల్ మ్రోగిస్తాము;

కొత్త ఏడాది, సంకురుమయ్యలు
హుందా ఐన పెళ్ళి పెద్దలు!
ఊరేగింపుల మన అందరికీ
ఉల్లాసం! ఉత్సాహం!
;
Pallaki muggu

;
ఉల్లాసం! ఉత్సాహం! my kolam

(this photo : link)

;

Lepakshi, koMDapalli bommalu

No comments:

Post a Comment