Monday, December 24, 2012

పృధ్వీ వీణ


వాన! వాన! వచ్చి వచ్చీ.........
గొడుగుల పూవులు పూచి-
రహదార్లన్నీ ఏర్లై;
గుడిసెలు, గుడులూ, మడులూ;
ఇళ్ళు వాకిళ్ళు; మేడలు మిద్దెలు;        
వర్ష ధారల పసిడి పూతల మేల్మి బొమ్మలై;

ఈ భువి సొగసుల గాంచిన ఆ ఆకసము
అహో! పారవశ్యాల జలకములాడెను; ;;;;;

వర్ష దేవతలూ! జర భద్రం!
మీ ఈ రాకకు ఇదె మా ఆహ్వానం!
ఇలాతలమ్ము మీకు నేస్తము!
అందుకె  మీరు అతి వృష్టితో
మా అవనీ జననికి
కలిగించకుడు కంగారు:

పుడమిని బంగరు వీణగ చేకొని
వానధారల తంత్రుల జేసి
ఓహో! సువిశాల గగనమా!
సుతి మెత్తగ నీవు మీటినప్పుడే
వెల్వడు మంచి సంగీతం!
పలుకును సొగసౌ రాగాలు!
;;
*************************;

        వానదేవతలకు అర్చనలు

వర్ష దేవతలూ!! జర భద్రం!
మీ రాకడ పోకడ; పరిమితి నుంటే;
పంటల తల్లికి ఆమోదం, ఆహ్లాదం!!!!! ;
అపుడే మీకు అందును ప్రజల అభిమానం;
అందుకే. అందుకొనుడివే; మా పూజా పునస్కారం!  


అఖిలవనిత
  18904 పేజీవీక్షణలు - 682 పోస్ట్‌లు, చివరగా Dec 21, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
  35351 పేజీవీక్షణలు - 965 పోస్ట్‌లు, చివరగా Dec 14, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
  2164 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది


No comments:

Post a Comment