Tuesday, March 29, 2011

మా రాముడు బుద్ధిమంతుడు!
































:::::::::::::


నీల మోహనా! వనమాలీ!
మురళీధర! క్రిష్ణా!
నీకిది మేలా? మరియాదా?
కూడదయ్య మారాములు ||

మన్నును బొక్కి - వెన్న అనేవు
అన్నుల మిన్నల కోకలు దాచి
నెమలి, పింఛములనుచూ బుకాయింపులా!!?
కూడదయ్య మారాములు!
తల్లి మాటలను వమ్ము సేయకుర! ||

"బుద్ధిమంతుడు మా రాముడ"నీ
ఇరుగు పొరుగులతొ ఇపుడే జనని
చెప్పినదయ్యా!క్రిష్ణయ్యా!
కూడదయ్య మారాములు!
తల్లి మాటలను వమ్ము సేయకుర! ||

(మా రాముడు బుద్ధిమంతుడు!
అన్నది యశోద అందరితో)












||||||||||||||||||||||||||||||||||||||||||||||

No comments:

Post a Comment