Friday, August 14, 2009

వెండి తెరపై బంగారు గానం


-

-

-

( కాంతా రావు,కృష్ణ కుమారి

-యుగళ గీతము )
(పల్లవి ) :::::

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది //

కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి
నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి //వెన్నెలకేలా //

బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో

పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా
నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా..//వెన్నెలకేలా //

మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
ఓ మరదలు పిల్లా! జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా .. //వెన్నెలకేలా //

--------------------------------------------------

చిత్రం :కానిస్టేబుల్ కూతురు
రచన:ఆత్రేయ:
సంగీతము:ఆర్.గోవర్ధన్
గాయకుడు: పి.బి.శ్రీనివాస్

No comments:

Post a Comment