Monday, August 24, 2009

వన మయూరి

Baala

గోడలపై నానుడులు

చిన్నోడా!చిన్నోడా!సరదాగా రారండీ!
పలక,బలపం పట్టి
పుస్తకం చేత పట్టి
పాఠశాల కెడదాము! //

1)అమ్మకు,అయ్యకు మనము
ఇప్పుడే చెబుదాము
వేలి ముద్రలను మాని
చే వ్రాళ్ళను చేదమనీ! //

2)గుడి గోడలపై పాటల
నిట్టే చదివేస్తాము
లెక్కలు,సైన్సులు నేర్చి
లోక జ్ఞానమలవడేను //

3)నోట్లు,అప్పు పత్రాలను
వివరా లు తెలుసుకుంటారు
ప్రపంచమ్ము చరిత్రలను
బాగ తెలుసుకుంటారు

************************************************

Baala

జీవనగమ్యం

ఊగూ ఊగూ ఉయ్యాలా!
ఉగ్గూ పాల జంపాలా!
లాలీ లాలీ జో!(2) //

రమ్యమైనదీ రామాయణము
ఆదర్శ జీవన పథ గమ్య మది !
లోకమ్ముల ధన్య పరచు
కాంతి "గది"గ నీదు మదిని
సృజియించే భక్తి నిధి, ఇది //

ఇతిహాసమ్ముల నెలవు
పవిత్రతల కొలువు
సన్మార్గముల నడిపే
ధ్యేయమైన గురువు //

*********************************************************

మయూరి అందాలు

అంద చందాల నెమలి
ఆట లెన్నొ ఆడింది
పురి విప్పి సందడిగా
నాట్యాలే చేసినది //

నెమలి కనుల సోయగాలు
ఆమని గీతాలకు
ఆమోదపు పల్లవులను,
అను పల్లవి,చరణాలను
సమ కూర్చును ముచ్చటగా//

చంద మామ వెన్నెలలు
తోట పైకి జారాయి
చెట్ల ఆకు సందులలో
సన సన్నని నవ్వులుగా //

ఉద్యానంలో జాడలు
నింగిలోని తారకలు
విప్పారిన నెమలి పురికి
ఏ మాత్రం సాటి వచ్చు!?! //

********************************************************

No comments:

Post a Comment