Wednesday, March 3, 2010

అదే తిరుమల!
శ్యామ సుందరాంగా!
శరణు జొచ్చినారము
నీ - ప్రేమ మందిరము కదా,
భక్త హృదయ పద్మము ||

శరణు! శరణు! శరణనుచూ
ఎలుగెత్తుచున్న పలుకులు
అనయము అవి మావి!
అరణము నీ అనునయము
ఆ ఆస్థి అంత మాది ! ||

గోవింద! గోవిందా! - అనుచు
సాగు మా పరుగులు
అదె కొండల కోవెల
మా అడుగు జాడ మెరుపు చెండ్లు
గమ్యము అదే తిరుమల ||


Kovela

అదే తిరుమల!

By kadambari piduri, Feb 27 2010 7:59AM

No comments:

Post a Comment