పూవింటి దాల్పు జనకుడా!మదిని నిను –భావించగానే బ్రోతువని వింటి!" గోవింద ” -నామము మహిమ అంతటిది ! ||వల్ల మాలిన కోపమేలయ్యా?ఛల్లనయ్యా! తాల్మి దాల్చుము" వల్లకో ”మన కినుక లింతేల?నల్లనయ్యా! నవులు చిందించు! ||హరి చందనాలను చల్లమన్నావా?మరి, చల్లలమ్మే గొల్ల భామలసిరి కంటి చూపులవిరుల తావుల చల్లమన్నావా? ||నవ పారిజాతము దండ లివిగోరా!వివిధాకృతుల మణి – హారమ్ము లివి నీకే!అవతార పురుషుడ వీవె! తెలుసునులే!ధవళ హాసా! వందనమ్ములివే! ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
అవతార మూర్తి
By kadambari piduri, Feb 27 2010 5:25AM
No comments:
Post a Comment