దిక్కులకు ఆదియౌ - చక్కనీ స్వామికిజయ మంగళం , నిత్య శుభ మంగళం ||పచ్చ తోరణములతో – నిత్య వైభోగి స్వామిజయ మంగళం , నిత్య శుభ మంగళం ||హెచ్చుగా భక్తులకు – అచ్చ కల్ప తరువీవుగాలచ్చణంగా దక్కితి వదె - పది వేలు ,లచ్చ వరహాలుజయ మంగళం , నిత్య శుభ మంగళం ||నిక్కువము మా కెపుడు – చుక్క పొడుపుల మేల్మిమక్కువౌ పర్వముగ – మిక్కుటముగ నీ ధ్యాసచక్కనీ శ్రీ వేల్పు తిరు వేంకట నాథునికిజయ మంగళం , నిత్య శుభ మంగళం ||నచ్చి నిన్ను వరియించిరి –లచ్చిమి , అలి వేల్మంగమ్మలు -విచ్చేసిరి భక్త కోటి -రచ్చ సేయకుండా ,ప్రొద్దు పుచ్చ కుండా -నచ్చ జెప్పి స్వామిని - పంపరమ్మ కొలువులకు -శుభ మంగళమనుచునుజయ మంగళం నిత్య శుభ మంగళం ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
జయ మంగళం ! నిత్య శుభ మంగళం!
By kadambari piduri, Mar 9 2010 5:00AM
No comments:
Post a Comment