మురళి గాన సంపన్నుడు కృష్ణుడు
సరళ నర్తనమ్ములు – బొమ్మ కట్టినట్టి వాడు ;
నిరంజనుడు ,మా వాడు – మన వాడు
అందరి వాడు, అందరితో వాడే!
మన అందరిలో వాడే ||
అల నీలి మేఘ వర్ణమతని ముందర దిగ దుడుపు
గాలి వేణువున చేరి “ పాటగ” మారి,
వాని చుట్టు ప్రదక్షిణలు సేయు చుండు నిరతము ||
తన – రూప లావణ్యములకు – ప్రకృతి దాసోహమగును
రూపు కట్టినట్టి లాస్య కళా సంపన్నుడు
నిరుపమ గుణ స్తోముడు , నిఖిల లోక రక్షకుడు ||
( అందాల శ్రీ కృష్ణుడు ::::::: )
_________________
( rachana ; kadambari ) ;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
aMdaala SrI kRshNuDu ::
_____________
muraLi gaana saMpannuDu kRshNuDu
saraLa nartanammulu – bomma kaTTinaTTi vaaDu ;
niraMjanuDu ,maa vaaDu – mana vaaDu
aMdari vADu, aMdaritO vaaDE!
mana aMdarilO vaaDE ||
ala nIli mEGa varNamatani muMdara diga duDupu
gaali vENuvuna chEri “ paaTaga” maari,
vaani chuTTu pradakshiNalu sEyu chuMDu niratamu ||
tana – rUpa laavaNyamulaku – prakRti daasOhamagunu
rUpu kaTTinaTTi laasya kaLA saMpannuDu
nirupama guNa stOmuDu , niKila lOka rakshakuDu ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment