ఆ సౌందర్య సౌమనస్యములు ;;;;;____________________కదలవె! మనసా! కదలవె మనసా!మురళీధరుని మోహన రూపపుతలపు కొలనుల జలకములాడగ //అలకలు అల్లల నాడగ :జిగి బిగిఅలకల కులుకులు - నవ్వుల మురియగ //నీలి ముంగురులు కస్తూరి - తిలకము నానగకలువ కన్నుల జాబిలి దోగాడముత్యము మురిసే - ముక్కును ముద్దిడ //కౌస్తుభ పతకము, పూవుల దండలుహరి చందనమున తానమాడు ఎద(ను)పరిమళ సొగసుల ముద్దాడంగా //కాళియ ఫణముల మణి రజనులు రాలగనూపుర రవళిని హత్తిన పదములమధుర నాదములు పులకించంగా //$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Posted On 8/15/2009 @8:49:51 PM [ Andhra Folks . net ]
No comments:
Post a Comment