Saturday, March 20, 2010

కొమ్మలు


















టకటం, టకటం , టక టక టం
టక్ టక్ , టిక్ టిక్ టక టిక్ టిక్ ........
కోలాటముల ఆటలతో
కోలాహలములు, ఓ సఖియా! ||

నిన్నటి దాకా వట పత్ర శాయివి ,
ఇవి - నేటికి పెరిగెను ఇన్ని నటనలుగ,
నాట్య వల్లరుల అల్లరల్ల్లలుగా ,
సిరి ! సిరి ! శేష శాయీ! క్రిష్ణా! ||

చురుక్కు చురుక్కు చింత బరికలతో
ఆల మందలను అదిలించేవు;
వెదురు గొట్టముల మలచి వేణులుగ
మధు రాగాలను బెత్తాయిస్తువు ||

మొద్దుల మద్దులు గంధర్వులుగా
మారుట లోకములందున చోద్యము !
కొయ్యలు, బెండ్లుకు చైతన్యమ్ములు
నీ చేతి - మహిమల కతముననే. కన్నా! ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

కొమ్మలు

[ Krishna and people
play and DANCE of Sticks - kolatam / bhangra ]

By kadambari piduri, Dec 18 2009 7:19AM

No comments:

Post a Comment