Saturday, March 20, 2010

చూపులే కళ్యాణ తిలకాలు


















కొన చూపుల- కడు వేడుక
సుతి మెత్తగా – సతతము అల్లితివి
అతివరో! ఈ మేల్మి పఱదాలు ఎవరికే? ||

1.అటు వేపు శ్రీ దేవి – ఇటు పద్మావతి
అటు ఇటు – ఇటునటు - నటనాల దృక్కులు
మలయ, మారుతపు యవనికల - కళ్యాణ తిలకముగ
చిత్రముగ వెలసేను !?!-విచిత్రమిది ,కను గొనగ
పరాకు చిత్తగించి - చిత్రాంగి! బహు పరాక్! - ||

2. మోమోటముల గెంతు కొన్ని చూపుల్లు
తటపటాయింపుల కొన్ని వీక్షణములు
శ్రీ నాథుని చిలిపి నటనాల చూపుల్లు
నీ క్రీ గంటి చూపుల – అపరంజి పరదాలు
వేయుమా ! అతివరో! – నీదు హృదయేశునకు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

చూపులే కళ్యాణ తిలకాలు
( Radha's sweet looks at krishna bhagavan
are like" bride's sindhur " )

By kadambari piduri, Dec 27 2009 6:05AM

No comments:

Post a Comment