Monday, March 22, 2010

తారల మిలమిల కాంతులు
















తారల మిలమిల కాంతులు వచ్చి
దొరతో జగడము విన్నవించును
ఎట్లాగమ్మా చిక్కుల ముళ్ళను
విప్పేదెట్లా ? చెప్పమ్మా! ||దొరతో ||

రమణుని ఉరమున సుమ హారముల
మరంద రాసులు కుప్పలు కుప్పలు
పుప్పొడి రజనుల తళతళలు
ఒప్పుల కుప్పలు ఆడుచుండగా
పోటీ మాకివి భువి నక్షత్రములని || దొరతో ||

కోమలి పద్మ పాపిటి బిళ్ళల
మణుల ప్రభలు గుట్టలు గుట్టలు
జిగేల్ కన్నుల మిరు మిట్లు
ధరణికి చుక్కల అరణముగా
ఎవరిచ్చారని మిణుకుల తారలు || దొరతో ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&


Kovela ( Temple ) ;

తారల మిలమిల కాంతులు ; ( Twinkle stars ) ;

By - kadambari piduri, Mar 21 2010 10:59PM

No comments:

Post a Comment