Wednesday, March 17, 2010

రాగ వీణ రాధిక






















ప్రణయ సుధా కలశమ్ము- రాధిక
విభ్రమము తన ఊసుల - చరితల రచన ||
చరితార్థము ఆ నుడువులు – ఏమరక మననములు -
మరి మరీ చేసేటి - భక్తులు చరితార్ధులు ||

రాగ వీణియ రాధమ్మ - నిగ నిగల చెక్కిళ్ళ లోన
తన వెన్నెలల సిరి సంపదలను - గడుసుగా
దాచుకొనె మబ్బుల్ల జాబిల్లి ;
శశాంకు పోకడలకు - ఈసు పడె తారకలు ||

గిల్లి గిల్లి కజ్జాలా!?! –
అల్లరిగా , ఆ పైన
మళ్ళిన కినుకల తో
మల్లె , మొగలి తావి పిలుపులా !?
బహు చోద్యమ్ము లేవమ్మ ! నీ రీతులు !
ఒహొ !కోమలాంగీ !
ఓ సుందరాంగీ! రాధికా! ||

ఎల్ల లోకములను చల్లగా ఏలేటి
ఆది విష్ణువు నేడు నీ జడ పాయలందున

అల్లికల మొగలి రేకులలోన చిక్కు కొనినాడమ్మ!
బులి బుల్లి నీ దొండ పెదవులతో వెల్లడిని సేయవు!?
తేట తెల్లమొనరించవు - ఈ లాగు నీ రీతి
బులిపించుతున్నావు !!
బహు చోద్యము నీ రీతులు ||

Kovela
రాగ వీణ రాధిక

By kadambari piduri, Mar 9 2010 5:02AM

No comments:

Post a Comment