
ఆలించ వోయి వేంకటేశ!అతివ అలివేల్మంగకుసందియములు వేల వేలుతీర్చు - సందర్భమిదియె!నిలు నిలువో, నిలువుమోయి! - 2 ||ఇందు ముఖితొ సుందరమౌమేటి - చతురు లాడుటలో,స్వామి! నీకు నీవె సాటి! ||వనజ పాణి పద్మావతివేలి స్వర్ణ ఉంగరాలమెరయు రవలు, మణులు,నవ - రత్న,మాణిక్యములు ||అంగుళీయకము లిటులమర - కతములై తోచగాఅచ్చెరువుల తరళాక్షులవిపుల చర్చలు ||శ్యామ లాంగ మాధవునిచిత్ర రూపు వన్నియలప్రతిఫలనములు భాసిల్లినమేల్మి- సంఘటనలగుచ్ఛములే గుబాళింపులే ! ||&&&&&&&&&&&&&&&&&
Kovela
సందేహాలు
By kadambari piduri, Dec 5 2009 12:04PM
No comments:
Post a Comment