(పల్లవి ) ::::::________నీరద నిర్మల చిన్మయ మూర్తిసన్నిధి సకలానంద దాయకములభ్యము బ్రహ్మానందము తథ్యము,(అను పల్లవి ):::::_________హృదయ నళినమా!శ్యామ సుందరుని సేయి విడకుమా! ||భజన సేయుమా ! భజన సేయుమా !1. చెన్నుగ మృగ మద తిలకములునెన్నుదురును స్పృశియించేను !ఆ వృత్తములలో అటు నిటు ఊగుచుసహస్ర కోటి పొర్లు దండములువరలగ – సేయును ముంగురులు ||2. చిన్ని ముత్యముల తెలి కాంతులతోమిన్నగ పొందే గిలిగింతలతోవెన్న దొంగ సంపెంగ ముక్కునఎన్నెన్నొ పరుగుల మక్కువ తపసులువరలగ – సేయును కొండ గాలులు ||3. కన్నయ మేనున మణి భూషణముల్తిన్నగ దూరును అనుమతి లేకనె !అన్నన్నా ! తన చను వింతటిదా!!?ఉదయాద్రి శృంగ పీఠమ్ము వరముగాగడించె గడసరి భాస్కరుడు ||
Friday, March 26, 2010
చల్లని నీడ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment