Krishna leelalu ;;;;;
కేళీ విలాసా! మా ఇహ పరముల దైవమా!
మోహన వంశీ కృష్ణ! అహరహమూ నీ ధ్యాస -
ఆ బాల గోపాలము - నకు జగమున, కను గొనవో!???? ||
నీ - ఫ్రతి అడుగు నాట్యము
ఫ్రతి చలనము హృద్యము
కళామ తల్లి వలిపెములో
అపూర్వ ప్రభా రాసులు ||
వేణువు రవళించు చోట
వినోదముల ప్రవచనములు
లోలాయమాన క్రీడలు
లాలించు పలుకు గానములు ||
లలిత కళా సోపానము
లల్లి బిల్లి నర్తనములు
ఉలి అక్కర లేని – చలన
శిల్పమైనదిట పల్లె ! -
మా వ్రేపల్లె ||
&&&&&&&&&&&&&&&&&&&&
kELI vilaasaa! maa iha paramula daivamA!
mOhana vaMSI kRshNa!
nii - Prati aDugu naaTyamu
Prati chalanamu hRdyamu
kaLAma talli valipemulO
apUrva praBA raasulu ||
vENuvu ravaLiMchu chOTa
vinOdamula pravachanamulu
lOlaayamaana krIDalu
kOlaaTamu saMdaDulu
uravaDulu ||
lalita kaLA sOpaanamu
lalli billi nartanamulu
uli akkara lEni – chalana
SilpamainadiTa palle ;;
maa vrEpalle ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
దిక్కులకు ఆదియౌ - చక్కనీ స్వామికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||
పచ్చ తోరణములతో – నిత్య వైభోగి స్వామి
జయ మంగళం మంగళం నిత్య శుభ మంగళం ||
హెచ్చుగా భక్తులకు – అచ్చ కల్ప తరువీవుగా
లచ్చణంగా దక్కితి వదె - పది వేలు ,లచ్చ వరహాలు
జయ మంగళం నిత్య శుభ మంగళం ||
నిక్కువము మా కెపుడు – చుక్క పొడుపుల మేల్మి
మక్కువౌ పర్వముగ – మిక్కుటముగ నీ ధ్యాస
చక్కనీ శ్రీ వేల్పు తిరు వేంకట నాథునికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||
నచ్చి నిన్ను వరియించిరి – లచ్చిమి , అలి వేల్మంగలు -
విచ్చేసిరి భక్త కోటి - రచ్చ సేయకుండా ,
ప్రొద్దు పుచ్చ కుండా - నచ్చ జెప్పి స్వామిని -
పంపరమ్మ కొలువులకు - శుభ మంగళమనుచును
జయ మంగళం నిత్య శుభ మంగళం ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
dikkulaku aadiyau - chakkanii svaamiki
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||
pachcha tOraNamulatO – nitya vaiBOgi svaami
jaya maMgaLaM maMgaLaM nitya SuBa maMgaLaM ||
hechchugaa Baktulaku – achcha kalpa taruviivugaa
lachchaNaMgaa dakkiti vade - padi vElu ,lachcha varahaalu
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||
nikkuvamu maa kepuDu – chukka poDupula mElmi
makkuvau parvamuga – mikkuTamuga nI dhyaasa
chakkanI SrI vElpu tiru vEMkaTa naathuniki
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||
nachchi ninnu variyiMchiri – lachchimi , ali vElmaMgalu -
vichchEsiri Bakta kOTi - rachcha sEyakuMDA ,
proddu puchcha kuMDA - nachcha jeppi svaamini -
paMparamma koluvulaku - SuBa maMgaLamanuchunu
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ప్రణయ సుధా కలశమ్ము రాధిక
విభ్రమము తన ఊసుల చరితల రచన ||
చరితార్థము ఆ నుడువులు – ఏమరక మననములు -
మరి మరీ చేయు చుండు - చరితార్ధులు భక్తులు - ||
రాగ వీణ రాధిక - నిగ నిగ చెక్కిళ్ళ లోన
తన వెన్నెల సంపదలను - సొగసు గడుసు రీతిలో –
దాచుకొనె శశాంకుడు - ఈసు పడెను తారకలు ||
గిల్లి గిల్లి కజ్జాలా!?! – అల్లరిగా , ఆ పైన
మళ్ళిన కినుకలతోడ - మల్లె తావు పిలుపులా !?
బహు చోద్యము నీ రీతులు ! కోమలాంగి రాధికా! ||
ఎల్ల లోకముల నేలు ఆది విష్ణు - విల్లాగ నీ సిగలో మొగలి రేకు
లల్లికలో చిక్కు కొనెను - బుల్లి దొండ పెదవులతో
తేట తెల్లమొనరించవు - బహు చోద్యము నీ రీతులు ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
praNaya sudhaa kalaSammu raadhika
viBramamu tana Usula charitala rachana ||
charitaarthamu aa nuDuvulu –
lOkO – ttara gaathalu - charitaardhulu bhaktulu
mari mari – nii mananammunaMdu ||
niga nigala chekkililO vennela saMpadalanu
sogasu gaDusu rItilO – daachukone SaSAMkuDu ||
gilli – kajjaalaa!?! – maLLina kinukalatO
malle taavu pilupulaa !!!!? - bahu chOdyamu nI rItulu !!
alla lOkamula nElu aadi vishNu - villaaga nI sigalO mogali rEku
lallikalO chikku konenu - - bahu chOdyamu nI rItulu ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
jagamula Elika kannayya –vagalolikE Baamaa maNikii
vagaru Usula togarula muchchaTlu – vInula viMdulu O yammaa! ||
jagaDamu luttutti praNaya kalahaalu – mujjaga yaanapu naarada mauniki
tega pani kalpiana – mahatiki truLLiMta - vInula viMdulu O yammaa! ||
gaganapu nIlamu svaMta daaruDu – maga naalu raadhalO saga BAgamayEnu
Baga vaMtuDu Baktula daasuDu nityamu - viMdulu O yammaa! ||
agapaDaDaataDu kannu dOyiki – Kaga raja vaahanuni daaguDu mUtalu
nagavula naaTyamu, lalita kaLalaku – kEMdramu ,kanukane kamanIyamulu
kammani kathala lOgiLLu – immuga manaku dakkinavi ||
===============================================
జగముల ఏలిక కన్నయ్య –వగలొలికే భామా మణికీ
వగరు ఊసుల తొగరుల ముచ్చట్లు – వీనుల విందులు ఓ యమ్మా! ||
జగడము లుత్తుత్తి ప్రణయ కలహాలు – ముజ్జగ యానపు నారద మౌనికి
తెగ పని కల్పన – మహతికి త్రుళ్ళింత - వీనుల విందులు ఓ యమ్మా! ||
గగనపు నీలము స్వంత దారుడు – మగ నాలు రాధలో సగ భాగమయేను
భగవంతుడు భక్తుల దాసుడు నిత్యము -కన్నుల పంటలు ఓ యమ్మా! ||
అగపడడాతడు కన్ను దోయికి – ఖగ, రజ వాహనుని దాగుడు మూతలు
నగవుల నాట్యము, లలిత కళలకు ,కేంద్రము ,కనుకనె కమనీయములు
కమ్మని కథల లోగిళ్ళు – ఇమ్ముగ మనకు దక్కినవి ఓ యమ్మా! ||
================================================
jagamula Elika kannayya –vagalolikE Baamaa maNikii
vagaru Usula togarula muchchaTlu – vInula viMdulu O yammaa! ||
jagaDamu luttutti praNaya kalahaalu – mujjaga yaanapu naarada mauniki
tega pani kalpana – mahatiki truLLiMta - vInula viMdulu O yammaa! ||
gaganapu nIlamu svaMta daaruDu – maga naalu raadhalO saga BAgamayEnu
BagavaMtuDu Baktula daasuDu nityamu -kannula paMTalu O yammaa! ||
agapaDaDaataDu kannu dOyiki – Kaga, raja vaahanuni daaguDu mUtalu
nagavula naaTyamu, lalita kaLalaku ,kEMdramu ,kanukane kamanIyamulu
kammani kathala lOgiLLu – immuga manaku dakkinavi O yammaa! ||
================================================