Showing posts with label గీత రూపకము. Show all posts
Showing posts with label గీత రూపకము. Show all posts

Sunday, October 29, 2017

అంతు పొంతు లేని నీలుగు

అనీ అననట్లు - అన్నామా - 
వానికి అంతెరుగని నీలుగు ;
నీలుగుడు చాలంటే ; 
కస్సుమనును అది ఏమో!?
చెరుకు వింటి ఐదు పూలు : ||
;
అంతు పొంతు లేకున్నవి, ఐదు పూల ముచ్చటలు - 
గాలి పొడుగునా అంతు పొంతు లేకుండా అవేమిటి ముచ్చట్లు 1? - 
అన్నామా మేమంతా!? అనీ అనని విధాన ; అన్నామా మేమంతా!?
అంతెరుగని నీలుగు, వానికి ; అంతెరుగని నీలుగు ;;  ||
;
అనీ అననట్లు - అన్నానూ వానికి ; అంతెరుగని నీలుగు ;
నీలుగుడు చాలంటే ; కస్సుమనును అది ఏమో!? : ||
తక్కువేమి తినలేదు లెండి ; మేమున్నూ తక్కువేమి తినలేదు ;
ఆ ఊసులు ఏమిటో తెలుసుకొన్నాము లెండి ;
 - గాలిని బులిపిస్తూ, బుజ్జగిస్తు ; తెలుసుకొన్నాము లెండి
చిరుగాలి, చిలిపి గాలి, మా చెవిలో ఊదింది ఆ గుట్టు లోగుట్టు ;  ||
;
క్రిష్ణ లీల, రాసక్రీడ ; ప్రణయ వృత్తాంత గాధ ; 
పొద్దు కూడ తెలియకుండ ; చెప్పుకొనును తాము ;
తమలోన తాము ; మన్మధుని వ్రేళ్ళు మీటు - 
ఇక్షు ధనువు నారి నుండి వెలువడే పువ్వులవి ;
పంచ బాణ పుష్పములు ; ఆ కౌతుక, ఉత్సాహము ; 
సహజమైనదే వానికి ; ఔను కదా ముమ్మాటికి ; 
;
ఈ కబురులాటకు మేమూ - జత ఔతాము లెండి, 
ముదముతో పువులారా! ఒప్పుకుంటున్నారు కదా!  
ఔను కదా,సబబు కదా ; ఇది సదా, 
ఔనౌను కదా, సదా సదా! ;  ||
;
-   రూపక గీతం ;- 
=============================;
;
anee ananaTlu - annaamaa  ;
amterugani neelugu ;
waaniki, amterugani neelugu ;
neeluguDu caalamTE ; 
kassumanunu adi EmO!?
ceruku wimTi aidu puulu : ||
amtu pomtu lEkunnawi ;
aidu puula muccaTalu - 
gaali poDugunaa amtu pomtu 

lEkumDA awEmiTi muccaTlu? -  
annaamaa mEmamtaa!? anee anani widhaana ;
amterugani neelugu ; 
waaniki amterugani neelugu ;
;
anee ananaTlu - annaamaa ;waaniki, amterugani neelugu ;
neeluguDu caalamTE ; kassumanunu adi EmO!?

takkuwEmi tinalEdu lemDi ; mEmunnuu takkuwEmi tinalEdu ;
aa uusulu EmiTO - telusukunnaamu lemDi ;
gaalini bulipistuu, bujjagistu ;  telusukunnaamu lemDi ;
cirugaali, cilipi gaali, maa cewilO uudimdi aa guTTu lOguTTu ; 
;
krishNa leela, raasakreeDa ; praNaya wRttaamta gaadha 

; poddu kUDa teliyakumDa ; ceppukonunu taamu ;
- tamalOna taamu ; 
manmadhuni wrELLu meeTu - 
ikshu dhanuwu naari numDi weluwaDE puwwulawi ;
pamca baaNa pushpamulu ; aa kautuka, utsaahamu ; 
sahajamainadE waaniki ; aunu kadaa mummATiki ; 
;
ee kaburulATaku mEmuu - jata autaamu lemDi, 
mudamutO puwulaarA! oppukumTunnaaru kadaa! 
aunu kadaa,sababu kadaa ; idi sadaa, 
aunaunu kadaa, sadaa sadaa! ;  || 
;
-  ruupaka geetam ; 
;

Tuesday, April 25, 2017

గిల్లికజ్జాలు, వైరాలు

రాధ ;-
గిల్లికజ్జాలు, వైరాలు పెట్టుకుని, 
అల్లరిగా ఎక్కడనో దాగున్నాడు , 
గోవిందుడు , మన గోపాల కృష్ణుడు : ||
& 
ఈ రాధకు చూపవమ్మ 
కాస్త కరుణ చూపి, శిఖి పింఛధారిని చూపవమ్మ ; 
వన మయూరి, ఓ కేకీ! నా జీవన కాంతీ! : || 
;
నెమలి జవాబు ;- 
కనుగొన్నాను, వానిని నే కలుసుకున్నాను ; 
వాని జాడలను నీకు చెప్పమంటావా!? 
ఇపుడే నను చెప్పమంటావా!? ; || 
;
రాధ ;- అవశ్యం . సత్వరం . 
;
నెమిలి ;- 
తుంటరి కన్నయ్య ఆనవాళ్ళను ఇవ్వాలంటే ; 
నీకు - ఇవ్వాలంటే - 
పరిదానం, లంచము - ముట్టజెప్పాలి , 
నాకు ముట్టజెప్పాలి , 
గొప్ప దక్షిణలను నాకు - 
నసగకుండ భక్తితోటి - ఇవ్వవలెను, సరేనా!?!
;
రాధ ;- ఏమి కాన్క లివ్వాలో చప్పున చెప్పు!
వన మయూరి ;- 
నా ఈకలు, పింఛాలను - 
పరికరించవలె [tools] నీవు ; 
నెమలీకల తూలికలతో - తిలకములు దిద్దాలి ; 
క్రిష్ణమ్మకి కస్తూరి తిలకములను దిద్దాలి ; 
దిష్ఠి చుక్క అద్దాలి - నా పింఛముతో!
వాని మేను పయిన ; వన్నె బొమ్మలను వేయాలి , 
మకర పత్ర చిత్రలేఖనములను వ్రాయాలి అగణితముగ ; ||
;
రాధ ;- నీ షరతులన్ని తప్పక ; 
నెరవేరుస్తానమ్మా ఓ వయ్యారీ శిఖండమా! 
వైళమె వాని గురుతులను విప్పి చెప్పవమ్మ : || 
;
మయూరి ;-
మిలమిలలాడే నా పింఛాలెన్నిటినో : దారంట వేసాను ; 
కొండ గురుతులు, అవి నీకు దిక్సూచినులు ; 
నెమలీకల శోభలతో - తళ తళ లాడేస్తున్నది , ఆ బాటంతా ; 
ఈ దారిని పట్టుకుని, చకచక నువు నడిస్తేను - 
నీల మేఘ శ్యాముని, మురళీ మోహనుని - 
చిటికెలోన ఇట్టె నువ్వు చేరుతావు బేల రాధికా! 
చేరువ ఔతావు మదన గోపాలుని దివ్య సన్నిధిని ; || 
;
;- గీత రూపకం ;  
===================================;
;
=====================;  
gillikajjaalu, wairaalu peTTukuni, 
allarigaa ekkaDanO dAgunnaaDu , 
gOwimduDu , mana gOpAla kRshNuDu :  ||

 + kaasta karuNa cuupi, cuupawamma ; 

SiKi pimCadhArini O wana kEkI! naa jeewana kaamtee! :  || 

nemali jawaabu ;- 

kanugonnaanu , waanini nE kalusukunnaanu ; 
waani jADalanu neeku ceppamamTAwA!? 
ipuDE nanu ceppamamTAwA!? ; ||
raadha ;- awaSyam . satwaram . 

nemili ;-  tumTari kannayya aanawaaLLanu neeku - 


iwwAlamTE - paridaanam, 

lamcamu - muTTajeppaali ,  
goppa dakshiNalanu naaku - 
nasagakumDa bhaktitOTi iwwawalenu, sarEnA!?! ;
raadha ;- Emi kaan ka liwwaalO cappuna ceppu!

wana mayuuri ;- 

naa iikalu, pimCAlanu - parikarimcawale neewu ; 

nemaliikala tuulikalatO - 

tilakamulu diddaali ; kastuuri tilakamulanu diddaali  ; 
dishThi cukka addaali - naa pimCamutO!
waani mEnu payina ; 
wanne bommalanu wEyaali , 
makara patra citralEKanamulanu 
wraayaali agaNitamuga ; || 

raadha ;- nee sharatulanni tappaka ; 

nerawErustaanammA O wayyaarii SiKamDamA! 
waiLame waani gurutulanu wippi ceppawamma :  ||  

milamilalaaDE nA pimCaalenniTinO : 

daaramTa wEsaanu ; komDa gurutulu ; 
awi neeku diksuucinulu ; 
nemaleekala SOBalatO - 
taLa taLa lADEstunnadi , 
aa baaTamtaa ; 
ii daarini paTTukuni, 
cakacaka nuwu naDistEnu - 
neela mEGa Syaamuni, 
muraLI mOhanuni - 
ciTikelOna iTTe nuwwu cErutaawu 
bEla raadha ; cEruwa autaawu 

madana gOpaaluni diwya sannidhini ;  ||
;
; రాధా మనోహర ;  यशोदा कृष्ण ;-

Tuesday, March 7, 2017

కమ్మ కమ్మని విందు

చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది
సితా కోక చిలకమ్మ రుస రుసలు
కస్సు బుస్సు మంటోంది గొరవంక
విస విసా వచ్చింది వన మయూరం

నేస్తాల చిట పటలు మాన్పి వేయంగా
యోచనలు చేసాయి గబ్బిలాయి, గుడ్ల గూబ;

“ అడవిలోని దోస్తులను అన్నిటినీ
విందుకు రమ్మని” పిలిచాయి.

“వివాహ భోజనంబు – వింతైన వంటకంబు “
ప్రిపరేషనులలోన తలమునకలు అయ్యాయి.

ఇది చూస్తూ గుర్రు గుర్రు మన్నది గుంట నక్క ,
అది బహు జిత్తుల మారి.
గుట్టు చప్పుడవకుండా 
నక్కి నక్కి వచ్చింది నక్కమ్మ,
అంతేనా!?
గుప్పెడు ఉప్పు క్షీరంలో 
గభాలున గుమ్మరించి
ఉప్పు చప్పుడవకుండా 
జారుకుంది చల్లగా!

పాలు కాస్త విరిగిపోయె!
చెవుల పిల్లి కుందేలు
“బెంబేలు పడకండ”న్నది;
క్షీరాన్ని వడ కట్టింది,
ఉడుత సాయమవ్వగా
పన్నీరు, రసగుల్లాలను
చిటికెలోన రెడీ ఆయె !
వన భోజనమ్ములొహో!
వన జంతు, పక్షి, కీటకమ్ములు
ఖుషి ఖుషిగా కానుకలిచ్చి
షడ్రుచుల విందు నారగించి
“బ్రేవ్!”మంటూ త్రేన్‌చాయి;

గుడ్ల గూబ, గబ్బిలములు
అందుకొనెను అందరి మన్ననలు, అభినందనలు.
$$$$$$$$$$$$$$$$$$$$$$;

ద్రావిడ భాషా వర్గానికి చెందినది “ఆంధ్ర భాష”. 
శబ్దాలను, సవ్వడులను రెండు సార్లు ( ద్విరుక్తి ) పలకడము 
తెలుగు మాటలకు ఒక అందము చేకూరుతున్నది.
గుస గుసలాడుట, కిల కిలా నవ్వుట, 
మిస మిస కాంతులు ……. 
ఇలాంటివి అన్న మాట.
బాల బాలికలారా! 
ఇలాంటి మరిన్ని సరదా సరదా పదాలను – 
సరదాగా ప్రయత్నించి సాధించండి , చూద్దాం!!!!!!
  
( writer : P. kadambari ) ;

*******************************************:

]] కమ్మ కమ్మని విందు ;-  March 27, 2010   
రచన : కాందబరి పిదూరి ;-
చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది 
సితా కోక చిలకమ్మ రుస రుసలు 
కస్సు బుస్సు మంటోంది 
గొరవంక విస విసా వచ్చింది
]] పండు లాంటి పండుగ దీపావళి ;-   March 11, 2010   ;-
రచన : అనిల్ కుమార్ పిదూరి 
దివ్య దివ్య దీపావళి 
ప్రతి సారీ ఈ పండుగ “హుషార్ పండు” నవ్యమే! 
నవ నవీన పర్వమే! || – 
]] పక్షుల పలుకులు ;-           October 12, 2009 ;- 
“మాటలు అంటే   
మానవులకు మాత్రమె సొంతం”అంటే ఎట్లాగ? 
మైనా పిట్టల ఈల 
పాటలను, రామ చిలుకల ;
[ మా రచనల పట్టిక, జాబిల్లి, బాల కవితా గీతములు, గీత రూపకము ] 
&
jabilli 













జాబిల్లి బాల పత్రిక గీతాలు - 1 
; 

మబ్బు దుబ్బు జుట్టు

చిట్టి చిట్టి నెలవంక ; 
మబ్బు దుబ్బు జుట్టు తోటి ;
చిరాకుగా ఉన్నది, 
పరాకుగా ఉన్నాది ;  ||
;
కొబ్బరాకు కంఘీని 
   తెచ్చి ఇచ్చె వనదేవి ;
దువ్వుదాము మొయిలు జుత్తు ;   || 

దువ్వెనతో దువ్వుదాము 
   మొయిలు జుత్తు ;  
దిద్దుదాము తీరుగాను ; 
  తీర్చి దిద్దుదాము తీరుగాను ;;  ||
చీకాకు పోగానే 
   పలకరించె నెలవంక ;
చిమ్మ చీకటికి కూడా 
       తాను నేస్తమైనాది ;  || 

నవ్వులను చిందిస్తూ, 
   వంగి చూసె మేదినిని;
వెన్నెల - నవ్వులను చిందిస్తూ, 
   వంగి చూసె మానవులను; ;  ||

====================;

ciTTi ciTTi nelawamka ; 
mabbu dubbu juTTu tOTi ;
ciraakuagaa unnadi, 
paraakugaa unnaadi ;  ||

kobbaraaku kamghiini 
tecci icce wanadEwi ;
duwwudaamu moyilu juttu ; 
duwwenatO duwwudaamu moyilu juttu ;  || 

diddudaamu teerugaanu ; 
teerci diddudaamu teerugaanu ;;  ||

ceekaaku pOgaanE 
palakarimce nelawamka ;
cimma ceekaTiki kUDA 
taanu nEstamainaadi ;  || 
;
nawwulanu cimdistuu, 
wamgi cuuse mEdinini;
wennela - nawwulanu cimdistuu, 
wamgi cuuse maanawulanu; ;  ||

& [ మా రచనల పట్టిక, జాబిల్లి, 
        బాల కవితా గీతములు, గీత రూపకము,  ] 
మబ్బు దుబ్బు జుట్టు ;
Jabilli , many [ LINK ]

Saturday, May 7, 2016

నిన్ను చేసిన బ్రహ్మకు బొమ్మ!

అమ్మా! బూచోడొస్తుంటే : 
నేను బుట్ట కింద దాక్కుంటా!
కొట్టబోకే అమ్మ! నన్ను తిట్టబోకమ్మా! ||
;
అమ్మా! ఆ బూచోడెట్లా ఉంటాడే!? 
నిన్ను చేసిన బ్రహ్మకు బొమ్మ!? ||
;
నల్లనల్లని వాడు ; నామాల వాడు ; 
బాన అంత వాడు ; ఒడలెల్ల నిండుగా; 
కారాముదాలను పూసుకున్నవాడు ;
పళ్ళికిలిస్తున్నాడే!! 
బుట్టలోన నక్కి ఉన్న ; నన్ను చూసి ; 
పళ్ళికిలిస్తున్నాడే!, పారపళ్ళికిలిస్తున్నాడే! ||
;
దుమ్ము ధూళీ మెలిక జడలన్నిటిని 
విరబోసుకొనొస్తాడు, వాడు విరబోసుకొనొస్తాడు 
బుట్టలోన నక్కి ఉన్న ; నన్ను చూసి ; 
పళ్ళికిలిస్తున్నాడే!, పారపళ్ళికిలిస్తున్నాడే!  || 
;
mother yashoda :-

క్రిష్ణాష్టమి రోజు ఈ మురళి వాయించు! 
కన్నయ్య! నీ జోలికీ వాడు ఇక రాడు ;
పెను మద్ది కొమ్మలతొ ; 
బూచి వీపు సాపు చేయి!
మర్దించీ మర్దించీ 
వాడిని దండించు
బహు బాగా దండించు ; 
భుజశాలివి నీలే!! 
నా ఒడియే నీకు కోట! 
బూచికీ భయమేసి దౌడు తీస్తుందిలే!
బజ్జోర, కన్నయ్య! 
కొంగు బంగారమా!! 
మా కొంగు బంగారమా!!  || 

=====================================,

#ammA! bUchODostumTE : 
nEnu buTTa kimda daakkumTA!
koTTabOkE amma! nannu tiTTabOkammA! ||
;
ammA! A bUchODeTlaa umTADE!? 
ninnu chEsina brahmaku bomma!? ||
;
nallanallani waaDu ; naamaala wADu ; 
baana amta wADu ; oDalella nimDugaa; 
kaaraamudaalanu puusukunna wADu ;
paLLikilistunnADE!!!
buTalOna nakki unna ; nannu chuusi ; 
paara paLLikilistunnADE!  ||
;
dummu dhuuLee melika jaDalanniTini wADu 
baaga wiribOsukonostADu ; ||
;
krishNAshTami rOju ii muraLi waayimchu! kannayya! 
nee jOlikii waaDu ika raaDu ;
penu maddi kommalato ; 
buuchi weepu mardana chEsi baaga ;
damDimchu bhujaSAli neewEle! 
naa oDiye nii kOTa! 
buuchikii bhayamEsi dauDu tiistumdilE!
bajjOra, kannayya! maa komgu bamgaaramaa!  ||  

***************************************,
;
అఖిలవనిత
Pageview chart 35695 pageviews - 848 posts, last published on May 6, 2016 - 
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక
Pageview chart 5370 pageviews - 152 posts, last published on May 6, 2016 - 
 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65649 pageviews - 1042 posts, last published on May 5, 2016

Thursday, April 24, 2014

రామాయణ కుసుమము


मा निषाद प्रतिष्ठांत्वमगमः शाश्वतीः समाः। 

यत् क्रौंचमिथुनादेकं वधीः काममोहितम् ।।



"మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః| 

యత్ క్రౌంచ మిధునా దేక మవధీః కామమోహితమ్||

అలనాడు ప్రభవించిన ఆ శ్లోక మహిమ ఏమొ 

"ఆది కావ్యము" నకు శ్రీకారము ఆయెనొహో! 

అంతరంగముల స్పర్శ , అనుభూతుల ప్రతి ధ్వనియె 
లయబద్ధమైనది చిత్రమ్ముగా - పద చిత్ర కావ్య స్వరూపమ్ముగా 
ఇతిహాసమీ రీతి నవతరించింది.
ప్రతి అక్షరమ్మునూ ధ్యాన - పావనమ్మైనది 
లోకులకు అపురూప నిధి దొరికెను
శ్రీమత్ రామాయణమ్మనెడు కావ్య రాజమ్ముగా
సంఘ నియమావళికి రాజ నీతికిని
భేదమేమీ లేని కొంగ్రొత్త రచనమ్ము 
విశ్వమ్మునందునే తొట్ట తొలిది ఇదే “శ్రీరామ”! 
శ్రీరామభద్రుడు నడచి ఏర్పరిచెను 
ఈ బాట ప్రజలకు బహు భద్రమ్ము ఆయెను

శ్రీ రామభద్రుని చరితమ్ము ఇటు నిటుల
శుభముగా నగుటయే"ఆహ్లాదమాల" యగును
నేటి కిట్లు నేను సంపూర్ణ రామాయణము వ్రాయగలిగినాను
ధన్యమైనది నాదు జీవితము నేటికి
ఆదర్శ సంఘపు ఒరవడిని; పెట్టినది ఈ ఘంటము!
తాళపత్రములకు వందనమ్ములు చేసె ముని
కవిలెకట్టలను పీఠమ్ముపై నుంచి, అర్చించె!

******

ఘన శ్లోక సంపుటిగ అవతరించిన వారు ఎవ్వరయ్యా? 
అదె వచ్చుచుండెను - శాంతభావ రస ప్రతిరూపము 
ఆదికవి వాల్మీకి, పుంభావ సరస్వతి అతనే సుమీ!
పలుకు పలుకున మనసు పులకించగా
ప్రతి మనసు మానవత పలుకు బంగారమవగ
పులుకు పులుకున మమత పలవించగా
అని తలచుచూ వల్మీక జనితుడు
సరయూ నదీ తటిని తిరుగాడ వెడలెను
సంధ్యా వందనానుష్ఠానములను ఒనరించు విధి కొఱకు
తా బయలుదేరేను మును జన్మలో బోయ రత్నాకరుడతడు
సంస్కారము చేత దివ్య కవి ఋషియైన పుణ్య శీలుండు!

******

వచ్చెనదిగో తండ్రి, వాల్మీకి మునిరాజు!
శిష్య భరద్వాజ, వన వాసులు కాంచిరి అడవిలో 
మూర్ఛిలిన అపరంజి బొమ్మంటి నారీ శిరోమణిని! 
బిరబిరా గురుదేవు వద్దకు వెడలినారు 
"పుణ్య తమసా తటిని; ఒక తటిల్లత కాంతి
శోషిల్లిన జ్యోతి, అది ఎవ్వరో" అనుచు,

శిష్య గణములు తెలుప, ఆదికవి విచ్చేసె; 
దరి చేరి, కాంచిరి అటనున్న అతివను

నిడుపాటి గడ్డమును మంద వాయువు నిముర 
మందహాసము మెఱయ అరుదెంచె నచటకు; 
ముప్పిరి గొన్నట్టి విస్మయము తోడ 
తన దివ్య దృష్టి తోడ వాల్మీకి కనుగొనెను

"మూర్ఛిల్లిన వనిత వేరెవ్వరో కాదు 
శ్రీరామచంద్రుల సహధర్మచారిణి!
జగదైక పా,వని జగద్ధాత్రి, 
సీతమ్మ మా అమ్మ! అయ్యయో!!"
నట్టడవిలోన ఆ అయోధ్యా రాణి 
స్పృహ తప్పి పోయిన కారణము బోధ పడి 
సకల నేపధ్యమ్ము బోధపడ మునివరుడు డిల్ల వడె! 
"భూపుత్రి సీతమ్మ అతి కోమలాంగి; నిండు చూలాలు
నది తమస కెరటాల శీతల పవనాలు 
సీత కన్నీటికి నిలువెత్తు సాక్ష్యాలు;

విమల రామాయణ కర్త ,వీక్షణములు కూడ 
విస్తృత చకిత విస్ఫారితమ్ములాయె. 
అమల పున్నెముల ప్రోగు, సౌశీల్య రాశి 
అబల జానకీ మాతయే ఈమె;

ఎంత తరచిన గాని విధి లీల ఇంతేను, 
ఎవరి వశమున లేని తుంటరిది విధి - అనుట నిర్ద్వందము,
కాలపురుషుని నిత్య నిర్వచనమది కదా! "

******
శాంతికి నిలయము తాపసి ఆశ్రమము,
లోక పావని! అమ్మ! కొలువైన తరుణమున 
శ్రీ లక్ష్మీ ధామము ఆయెనమ్మా! నిజము! 
వనితామణిని సేదదీర్చిరి గిరి జనులు, 
ఆశ్రమ వాసినులు, పూజ్యులు వాల్మీకి, ఎల్లరు 
సానునయ వచనముల, సముదాయించినారెంతగనో
ఆదరమ్ముగ అక్కున చేర్చుకుని అనునయించారు

******
"మా ఆశ్రమమ్మిది! మహిళా మణీ! 
మనో వ్యధలను, శ్రమలను బాపు మహత్తులు గల 
మహిలోని మహనీయ స్థలమిది తెలియగా!!

చింతలూ, వంతలూ నిండుచూలాల! 
కలలలోనైనా నీ దరికి రాబోవు, 
నిండు నవ్వుల పున్నమల వెన్నియల్లు
నీ కెంపు అధరముల వ్రాలవలె సొంపుగా పరచుకొను!!

చింతకాయలు నీకు కోరినన్ని, 
పుల్ల మామిళ్ళు కావలసినన్నీ
నోటి మాట నోట ఉండగానే - 
ప్రతి తరువు, ప్రతి కొమ్మ నీ మోవికందించు!
లతలు పలుకరించు, లలనామణీ! 
నిశ్చింత భావాల తూగాడుతూ నాతిరో! 
ఉయ్యాలలందురుకు బిడ్డలను ఈవమ్మ!

******
ప్రకృతికి కూడా సీతపై కడు జాలి ;
ణతి సీతమ్మను - ప్రకృతిలో ప్రతి అణువు 
కను రెప్ప వోలె ;కాపాడు చుండేను!

వన కన్యకల ప్రేమ, 
వనదేవతల - మమత అనురాగ మంజరులు
పరిమళమ్ముల నిండె పరిసరములు; 

జనకజకు నిరతమ్ము గురుతు కొచ్చేను
గతమంత అనుక్షణము తలపులల్లికలై
నాగేటి పుట్టువు సీతమ్మ తల్లికి 
జ్ఞాపకముల నావ సాగుచూ ఉండేను 
కౌసల్య కోడలికి అవి సుంత ఓదార్పు!

ఎదురీత బతుకాయె అమ్మ సీతమ్మకు! 
ఎదురుచూపుల తెరవు, తెరచాపగా ఆమె 
తలపుల నెమరుల త్రుళ్ళింతలు; 
రవ్వంత జోడీలు రమణీ లలామకు ; 
“హరివిల్లు విరిచిన స్వామి కలువ చేయి - 
శివధనుర్భంగము చేసిన 
అలనాటి రాముల రూపము ;

నీలమోహను వంపు ఇంద్ర చాపమ్ము! 
ఎదురుకోలలలోన తన ఓరచూపు; 
మైధిలీ క్రీగంటి చూపులను పెనవేసి 
నవ్య హరివిల్లుగ - నీలాల గగనమున 
వెలసె, ప్రాణము వచ్చి! సభికులకు కను విందు!

సిగ్గుల తెర చాల దళసరిగ ఉన్నాది
ఇక పట్టనేల ఆ నడుమ తెరసెల్ల? 
ఓ చెలియలారా! మధ్య తెర దిగగానె
పూబోణిని స్వామీ తిలకించినాడు 
నాడు పద్మ దళ నేత్రుండు ఆ నాడు 
విరిసిన చిరునవ్వు విసిరినాడు 
కెంపు క్రీ పెదవిపై!
తనదు కొనగోట మీటెనో లేదో 
అంతటి శివ ధనువు 
అంతలింతలలోనే వింతగా విరిగింది 
జనక రా సభలోన దిగివచ్చినాదదిగొ     
శ్రీమంతమౌ ఏడు వన్నెల విల్లు!
సీతా స్వయంవరము భువనాల 
కందినట్టి అపురూప వారము సుమీ!

సిరి బాసికములోన రాముల రూపము 
చెంప దృష్టి చుక్క తన కంటిలోన 
నీలమోహనశ్యాము నవలాకు వన్నెలు
చిరునగవు వన్నియలు చిందిన తీరులు
చిటి చిలిపితనములు చిలికిన సౌరులు 
విరబూసె తనువున విరజాజి తావులే!

విరజిమ్మె మైమరుపు చిత్రాలు రచనలు 
కలికి కనుకొలకుల అనురాగ నళినములు 
తన తలపైన బెల్లము, జీల కర్రల మిశ్రమమ్ము 
భద్రముగ ఉంచిన రాము కరకమలమ్ము

"నీ మనసు పొరలలో శ్రీ రాఘవుండా! 
దాచుకుని ఉంచిన బొమ్మ నాదే కదా!?
నా వేలు పట్టిన ఆ చేయి నీదేను!
శిరసుపయి గుడ, జీర (= బెల్లము, జీలకర్ర) 
మిశ్రమమునుంచిన ఆ చేయి!
పసుపు తలంబ్రాలు హర్షధారలుగ 
జాలువారే రీతి;పోసినది ఆ చేయి!

ఆ చేయి, ఈ పగిది ఇపుడిటుల 
ఎటుల వీడేనయ్య! దాశరధీ, రామ! 
అరయనేరగలేను, అబలనైతిని నేను!
అలనాటి మురిపములు, దాంపత్య శోభల 
మణినూపురముల సుతిమెత్తని 
మధు సరస సందడులు శతకోటి అవి ఏవి? 
ఆ నాటి అచ్చటలు, అప్పటి ముచ్చటలు 
ఆ సంగతులు అన్ని నీటిజాడలు ఆయె, 
నిది ఏమి ఖర్మము? ఏ నాటి పాపమో ఈ గతిని 
పెనవైచి నను చుట్టుముట్టాయి

****** 
ప్రకృతికి కూడా సీతపై కడు జాలి - 
ప్రకృతిలో ప్రతి అణువు పణతి సీతమ్మను 
కనురెప్ప వోలె కాపాడుచుండేను! 
మొక్కలు, చెట్లన్ని పూతలు పూసినవి 
పూవులు పూచినవి కాయలు కాచినవి 
కాయలు మా మంచి పళ్ళుగా మారినవి!!

ఋతువుల దీక్షలు ఫలియించెనమ్మా! 
కాలపురుషుని కనులు కాయలు కాచినవి! 
కాలము "మహోద్గ్రంధ కావ్యముగ మార

లోక పావని పొందె ఇనుమారు వరములను; 
ఆ పర్ణ శాలలో జంట కేరింతల్లు; 
కవల పిల్లలు పుట్టినారనుచు సందడులు! 
మునివాటిక గొప్ప డోల ఆయెను సుమ్ము! 
అను సంబరమ్ములు వనలక్ష్మి దేవివి!

కారడవిలో మునులు, గురు శిష్య బాలకులు 
గిరిజనులు, భిల్లులు, కోయ ఆటవికులున్ను; 
పశు పక్షి గణములు, తరు ప్రాణి కోటియును; 
సీతా సుపుత్రుల అచ్చట్ల ముచ్చట్ల 
సృష్టి యావత్తునూ ఓలలాడింది, భళి! 
ప్రకృతి కడ ముదముగా - మారాము బాలురది!
మా 'రాము పుత్రుల 'ముద్దు ముచ్చటల కొఱకు;
గారాము కొసరేటి- ప్రకృతి కడు గడుసరిది! 
భళి! అస్త్ర శస్త్ర విద్యలన్నింటినీ 
ఆడుతూ పాడుతూ జోడుగా నేర్చిరి;
లాలిత్య గానములు వెన్నతో పెట్టిన నికషోపలములు!
వారి ననుక్షణము పరికించు గురు తాపసి;

"ముద్దులొలికేటి ఈ కవలలు
శ్రీరామ సీతలకు కనుగవలు సత్యము!
ఈ జంట లోకముల కన్నులపంటలు ;
ఇక సమయము వచ్చె; 
సుశ్లోక ఇతిహాస రామాయణమునకు; 
వీరివ్వగలరు ఇలకు 'మంచి ముక్తాయింపును'

లోకక్షేమము కోరు దీర్ఘదృష్టి మునిది
"నేటి దాకా ఈ పచ్చనటవీ సీమ, 
మీ గాన లహరిలో ఓలలాడినది! 
కుశ కుమారా! నీవు తమ్మునితొ కలిసి; 
అయోధ్యా నగరమ్ము మీద ఓ పిల్లలారా!
మీదు గానార్ణవపు నవ – తుషారమముములను 
చల్లంగ కురిపించి నవీన యుగ పర్వమవ్వండి.

మీ గాన వివరణా నైపుణ్యములనచట విశద పరచండి! 
పావనమ్మౌ గాథ రామాయణమ్ము 
సంగీత సరిగమల పరిమళమ్ములుగా; 
సాకేతపురమున ప్రజల ఎడదలలోన పరివ్యాప్తి చెందవలె

సకల జన భావనలు - మమతలకు ఇరవులగు; 
"శ్రీరామ-చుట్టబడు" శుభలగ్న వేళలు; 
మీ వలన సౌభాగ్య సన్నివేశములు 
ఇతిహాస హాసమై రూపొందుటన్నది;

ఈ సీమలకు లబ్ధి, పరమ పెన్నిధులు!
లవ కుమారా! మీ అన్నదమ్ములకు 
చల్లని మా శుభ ఆశీస్సులు!" 
సౌభాగ్య దీవెనలు తోడుగా ఉండె!

******

తోడుగా కొందరు జడధారులు రాగ; 
జత బాలురు జంటరాగమ్ములవోలె; 
అడుగులు ముందుకు వేయుచూ సాగిరి
"ఆదికవి వాల్మీకి రసరమ్య చిత్రణము - 
భావి జగతికి శ్రీకల్పవృక్షమ్ము!" ; 
అడుగడుగునా మధుర రాగముల 
చిలుకుతూ కుశలవ కథా బోధనా ప్రజ్ఞలకు;
మార్గమున ప్రజలెల్ల; మురిసి మైమరుచుచూ, 
జేజేలు పలికేరు ఆ బిడ్డలిద్దరికి!
శ్రోతల, ప్రేక్షకుల కన్నీటితోటి 
అయోధ్యా పురి నేల చిత్తడి ఐనది 
జలముల తడిసేటి ఈ దరి; 
గగన జాహ్నవిదా? సీతమ్మ లోచనమ్ముల 
ఇగురని కన్నీటి నిద్దంపు మడుగులో?

ఎల్ల మనుజాళి హృదయోదయ కిరణాలా? 
నవ నవోన్మేష అనురాగ రాగముల మాల ధారణలతో; 
నవ సమాజమునకు- నాంది- కలిగేను! 
కుశలవ కుమారులు నగరికీ చేరిరి;
జనశృతిని విన్నారు; రఘు వంశ వనితలు;
కౌసల్య, సుమిత్ర, కైకేయిలు, 
శ్రుతకీర్తి, మాండవి, ఊర్మిళాదులును 
అంతః పుర ప్రౌఢలు, స్త్రీ రత్నములు వారి చేరబిలిచారు
కొసరి కొసరీ అడిగి - గీతములు విన్నారు!
శ్రీరామచంద్రుడు, సోదరులు, తదితరులు 
ఆబాలగోపాలమా మాధురిని గ్రోలారు; 
తన చేతలు, గాధగా తానె వినవలసె నీ పగిది
రాముడు సంకటము లోబడుచు తడబాటు నొందాడు, 
"హా సీత! ప్రియ రాణి!" అనుచు విహ్వలుడాయె!

******
కైకేయి నిలువెల్ల కదిలిపోయేను
"నేను విధియిస్తిని పదునాలుగేండ్లు 
శ్రీరామునికి నాడు, పొరపాటు నాది! 
ఇపుడు ఓ దైవమా! మరల పదునాల్గేళ్ళాయె! 
ఓ విధీ! నా వలెనె నీవును నేరమ్ము చేసితివి; 
సత్వరమె పాపమును సరిదిద్దుకొమ్మా! 
కొమ్మ సీతాదేవి రాముని పత్ని, 
ఎట నున్నదో? ఏమొ? ఎరుకైన లేదు 
పుత్ర సహితమ్ముగా దేవి పునరాగనమ్ము 
మాదు రాజ్యమ్మునకు శుభదాయకము, 
ఈ వరము నొసగుమమ్మా విధీ మాకు !!" 
అనుచు విలపించేను భరత జనని కైక!

****** 
పావనమ్మౌ గాథ రామాయణమ్ము!
సంగీత సరిగమల పరిమళమ్ములుగా; 
ప్రజల ఎడదలలోన వ్యాపించవలెను 
సకల జన భావనలు మమతలకు ఇరవులగు
శ్రీరామ-చుట్టబడు" శుభలగ్న వేళలు; 
మీ వలన ఒనగూడు సౌభాగ్య సందర్భములు 
పావనమ్మౌ చరిత- గా రూపొందుటన్నది; 
ఈ సీమలకు లబ్ధి, పరమ పెన్నిధులు!" 
స్మిత వదన ఋష్యశృంగ సతి శాంతమ 
మెటికలు విరిచుచూ దిష్టి తీసినది

నగర మనుషుల జోతలను గైకొని, 
కుశలవులు మరలిరి కాననమ్మునకు! 
గురువులకు, మాతకు చెప్పారు 
అన్ని వివరమ్ములను ముచ్చటగ!
&&&&&&&&&&&&&&






******
కాంచన సీతను పక్కన నిలిపి, 
రాములు చేసిరి అశ్వమేధమ్ము 
మడమ తిప్పని ఆ తురగ వల్గనము 
రామ మార్గమునకు కొంగ్రొత్త మలుపు!

******
విస్మయపరచగా లవకుశుల వీర విన్యాసాలు 
తనయుల చేతుల్లొ తన ఓటమియే గెలుపు అవ 
జనకుని చేరారు బిడ్డలిరువురును; 
"నాదు కర్తవ్యము నేటితో ముగిసె" నని 
అవనిజ కనులార శ్రీరామ కూటమిని - 
కాంచుతూ చేరినది - తన అమ్మ ధరణి ఒడిలోనికి!

నిరతమ్ము కదిలేటి అలల సరయూ నది; 
రామాయణమునకు కట్టి ఉంచిన ముడుపు!
చంద్రికల మోసేటి భాగీరధీ అలలు
శ్రీమద్రామాయణాహ్లాద హేమంత పుటలు.

Tags:- కుశలవ, తమసా నది, వాల్మీకి; ,
            ఋష్య శృంగ, శాంత

(గీత రూపకము : చైత్ర కోణమానిని)
716 Posts 

******

1
రామాయణ కుసుమము  User Rating:  / 3
Member Categories  - కోవెల
Written by kusuma kumari
Thursday, 17 April 2014 08:55
Hits: 137