Thursday, February 23, 2017

వ్రతము చేయు జానకి

శ్రీరామచంద్ర చరణాబ్జ పూజా వ్రతము 
                              చేయు జానకి ;  ||

మొగలి రేకు, మొల్లలు, మల్లెలు, సంపెంగలు - 
సురభిళ ఘుమఘుమల వ్రతములను ;
భక్తి, వినయములతోటి శ్రద్ధగా చేసినాయి ; 
           బహు శ్రద్ధగాను చేసినాయి ;  
శ్రీరామ పత్ని కుంతలముల ; 
        అవి తావులై విరబూసినవి ;  ||

భూమి పుత్రి సన్నిధిలో - 
       నోముల మయమాయెను ;
    సకలము - నోములమయమాయెను ...........,
;
"సౌమ్యతయే ఈ సీత- ఐనప్పుడు
ఇందేమి వింత ఉన్నదిలే!" - అని
సీతాపతి చిందించే చిరునగవుల 
శోభలతో నిఖిల సృష్టి విలసిల్లును ;  || 
;
; రామనిధి  ;

No comments:

Post a Comment