Thursday, February 23, 2017

నీ ఆరాధనయే పరమావధి

వనితా మణి కరములందు  
అరుణోద్యానాలు వెలసె ; 
ఎటుల? ఎటుల!? :  || 
;
కురువకం, గోరింట మోజు తీర ; 
నారీ మణి అర చేతులందు ; 
పంటలయీ పండినవి ;
గోరింటల ఎరుపులుగా పూసినవి,  
                         విరబూసినవి ;  ||
;
నవ రత్న ప్రభల కాంతులన్ని ; 
నేడు కాందిశీకులైనవి ; 
పడతి రాధ దరహాస శోభల ;
అభయములు పొందినవి ; 
                     ఆశ్రయాలు పొందినవి ;  ||
;
ఇన్నిన్ని సొబగుల కలిమిలను కలబోసుకొని ;
కోమలి రాధికతో నిన్ను చేరినాయి ; 
అవి అన్ని నిన్ను చేరినాయి ; 
నీ ఆరాధనయే వానికి పరమావధి కద ; క్రిష్ణా! :  ||  
;
- రాధా మనోహర ;

No comments:

Post a Comment