Thursday, May 19, 2016

గుప్పెడు పింఛముల గుత్తి


"ఏమర్రా! నే కొట్టిన గోటీ బిళ్ళ ఏది?"
"అదిగో అక్కడ!" చూపించాడు శ్రీ బాలకృష్ణుడు; 
"నా వామనగుంటల బాడిస గింజలు ఏవి? ఎక్కడ?"
"అదిగో అక్కడ!" చూపించాడు కృష్ణ మూరితి ;

"మా పెంపుడు మయూరి పురిలో పింఛాలు 
ఏవీ? ఎక్కడ?"  అడిగినవాడు ఈ పగిది
అందాల బాల క్రిష్ణమ్మ! 

"ఇవిగో ఇక్కడ!" పకపక నవ్వుతు 
చూపించారు గొల్లభామలు
దాచిన ఈకలు తెచ్చిరి పడతులు ; 
దాచిన నెమలి కన్నులు చూపిరి;

గుప్పెడు గుప్పెడు పింఛములు ; గుత్తిగ పట్టి; 
కృష్ణుని సిగముడినందు 
ఉంచినది నవ్వుతు రాధిక!

==============================================,

"EmarrA! nE koTTina gOTI biLLa Edi?"
"adigO akkaDa!" chUpimchaaDu SrI bAlakRshNuDu; 
"naa waamanagumTala bADisa gimjalu Ewi? ekkaDa?"
"adigO akkaDa!" chUpimchaaDu kRshNa muuriti ;

 aDiginawaaDu ii pagidi
amdaala baala krishNamma! 
"mA pempuDu mayUri purilO pimCAlu EwI? ekkaDa?" 
"iwigO ikkaDa!" pakapaka nawwutu 
chuupimchaaru gollabhaamalu
daachina iikalu techchiri paDatulu ; 
daachina nemali kannulu chuupiri;

guppeDu guppeDu pimCamulu ;
guttiga paTTi; 
kRshNuni sigamuDinamdu umchinadi nawwutu raadhika!

*************************************************,

అఖిలవనిత
Pageview chart 35820 pageviews - 852 posts, last published on May 17, 2016

No comments:

Post a Comment