Tuesday, May 3, 2016

అలవి మాలిన పనులు

అలవి మాలిన పనులు ఏల? 
పొలతి కడ, ఈ నటనలేల?
            చిన్ని కృష్ణా! అమ్మనైనా 
                   నిన్ను మన్నన సేయబోను ; 
                       నిన్ను నేను మన్నన సేయబోను ||   
;
దొంగలాటలు ఆడుచు వంగి వంగి ; 
గొల్లవారి ఇళ్ళు దూరి ; 
ఉట్టి పట్టి ; పాలు వెన్నలు ; 
పొట్ట నిండా తిన్న వైనం 
చెప్పినవిలే కుండలన్నీ! 
తెలిపినవిలే చట్టిలన్నీ || 
;
పందెములు వేసి, ఆటలాడి , 
తోటిపిల్లల మోడి చేసి ; 
చెట్టుకొమ్మల తల్లక్రిందుగ 
ఊగుడనుచూ – 
వారిపైన నీదు ధాటిని ;  
తెలిపినవిలే ఆలమందలు; 
వర్ణించినవిలే మర్రి తోపులు || 

===================================;

# alawi maalina panulu Ela? ;
polati kaDa, ii naTanalEla?
 chinni kRshNA! ammanainaa ninnu mannana 
sEyabOnu ; ninnu nEnu mannana sEyabOnu ||   
;
; domgalaaTalu ADuchu wamgi wamgi ; 
gollawaari iLLu duuri ; 
uTTi paTTi ; paalu wennalu ; 
poTTa nimDA tinna wainam 
cheppinawilE kumDalannii! 
telipinawilE chaTTilannii || 
;
 pamdemulu wEsi, ATalADi , 
tOTipillala mODi chEsi ; 
cheTTukommala tallakrimduga uuguDanuchuu – 
waaripai needu dhaaTini ;  
; telipinawilE Alamamdalu; 
warNimchinawilE marri tOpulu ||  

*****************************************;
[ పాట - బుక్ పేజీ  43 ]  

No comments:

Post a Comment