Monday, June 27, 2011

ధేనువుల విలువ
















కసవు మెసవే గోవు- నంద బాలుని స్పర్శ
నీలాగునన్ పొందెను
ఆలమందల విలువ- నందరికి తెలిపిన
గోపాలుడన్నచో అందరికి ముద్దు కద, ఓ యమ్మా!
గారాబములన్ని ఆతనికె కద తెలియ ఓ యమ్మా! ||  

భక్త కోటి పాలి కల్పకము క్రిష్ణుడు      
కారుణ్య సింధువు; గోవర్ధనోద్ధారు    
ప్రతి వాక్కు ఒక సూక్తి ;              
పలుకు పలుకుల రూపు నిండు భగవద్గీత;  
పలుకు విలువల నెల్ల జనులకు బోధ పడె          
నీల మోహన క్రిష్ణ
గొప్ప మహిమల వలననే ఓ యమ్మా!   ||

ఇరు దిక్కులందున శంఖ, చక్రమ్ములు;          
కుడి ఎడమలందున శ్రీ దేవి, భూదేవి                  
దక్షిణగ తిరు నాధు -        
సర్వ దర్శన భాగ్య- కలిమి లాభము కలిగె!!!!  
మా-భక్త జన కోటి నయన పర్వములాయె!      
నీల మోహన క్రిష్ణ
గొప్ప మహిమల వలననే ఓ యమ్మా!  ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


kasavu mesavE gOvu-naMda baaluni sparSa
nIlaagunan poMdenu
aalamaMdala viluva- naMdariki telipina
gOpaaluDannachO aMdariki muddu kada, O yammaa! ||

gaaraabamulanni aatanike kada teliya O yammaa! ||

Bakta kOTi pAli kalpakamu krishNuDu
kaaruNya siMdhuvu; gOvardhanOddhaaru
prati vaakku oka sUkti ;
paluku palukuna niMDu BagavadgIta;
paluku viluvala nella janulaku bOdha paDe
nIla mOhanu valana ) yammaa!   ||

SaMKa, chakrammulu; SrI dEvi, BUdEvi
kuDi eDamalaMduna
dakshiNaga tiru naadhu sarva darSana BAgya
lABamu kalige namma!
maa-Bakta jana kOTi nayanammulaku; O yammaa!  ||


@@@@@@@@@@@@@@@@@@@@@


        printsofjapan- wordpress-hinduism    (Link read:-  జపాన్ బ్లాగు) 


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No comments:

Post a Comment